Social 1080×1350 • Multi-page
14-04-2026 BREAKING NEWS 03:08 PM
swarnodayam.com
Telugu Daily News

​హుజురాబాద్‌లో ‘దేశీ గోవంశ రక్షణ సంవర్ధన సమితి’ ఆధ్వర్యంలో గోరక్షా పోస్టర్ల ఆవిష్కరణ

​హుజురాబాద్‌లో ‘దేశీ గోవంశ రక్షణ సంవర్ధన సమితి’ ఆధ్వర్యంలో గోరక్షా పోస్టర్ల ఆవిష్కరణ
Oplus_16908288


​మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి ​హుజురాబాద్ 14: హుజురాబాద్ పట్టణంలోని క్లబ్ ఆవరణలో దేశీ గోవంశ రక్షణ సంవర్ధన సమితి – తెలంగాణ (గోరక్షా విభాగం – విశ్వ హిందూ పరిషత్) ఆధ్వర్యంలో గోరక్షణ మరియు గోసంరక్షణపై అవగాహన కల్పించే పోస్టర్లను ఘనంగా ఆవిష్కరించారు.
​ఈ సందర్భంగా వూట్కూరి రాడాకృష్ణరెడ్డి ప్రాంత గోశాల సంపర్క్ ప్రముఖ్ గారు పాల్గొని మాట్లాడుతూ.. సమాజంలో గోమాత ప్రాముఖ్యతను చాటిచెప్పడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతిలో గోవుకు విశిష్ట స్థానం ఉందని, ప్రతి ఒక్కరూ గోసంరక్షణకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు.
​ప్రధాన డిమాండ్లు మరియు అంశాలు:
​పోస్టర్ ఆవిష్కరణ అనంతరం వారు ప్రభుత్వం ముందు పలు కీలక డిమాండ్లను ఉంచారు.
​చట్టాల అమలు.. తెలంగాణ రాష్ట్రంలో అమల్లో ఉన్న “గోవధ నిషేధ చట్టం 1977″ను కఠినంగా అమలు చేయాలి. ​అక్రమ గోరవాణా అరికట్టడం: అక్రమంగా తరలిస్తున్న గోవులను రక్షించి, అక్రమ గోశాలలపై చర్యలు తీసుకోవాలి.
​గోశాలల ఏర్పాటు: ప్రతి జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో అత్యాధునిక గోశాలలను ఏర్పాటు చేసి, ప్రస్తుతం ఉన్న గోశాలలకు తగిన నిధులు కేటాయించాలి.
​రైతులకు ప్రోత్సాహం: గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న రైతులకు మరియు గోపోషకులకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను అందించాలి.
​గోచర భూముల రక్షణ: ఆక్రమణకు గురైన గోచర భూములను వెంటనే విముక్తి చేసి గోవుల మేత కోసం కేటాయించాలి. ముఖ్యంగా బక్రీద్ వంటి పండుగల సమయంలో గోవధ జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
​ఈ కార్యక్రమంలో vhp పట్టణ, మండల అధ్యక్షులు కొమురవెల్లి రాజు, కంకణాల రమేష్ రెడ్డి, దేశీ గోవంశ రక్షణ సంవర్ధన సమితి సభ్యులు కందుల శ్రీనివాస్ రెడ్డి, మోతపోతుల రాకేష్, వాసు గో ప్రేమికులు మరియు వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Oplus_16908288

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!