Social 1080×1350 • Multi-page
14-04-2026 BREAKING NEWS 07:27 PM
swarnodayam.com
Telugu Daily News

డంపింగ్ యార్డ్ రద్దుకు నడుo కట్టిన గౌడన్నలు.. – ఒకరోజు నిరసన చేపట్టిన గీత కార్మికులు.

డంపింగ్ యార్డ్ రద్దుకు నడుo కట్టిన గౌడన్నలు.. – ఒకరోజు నిరసన చేపట్టిన గీత కార్మికులు.
IMG-20260414-WA0323

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పరిసర ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డ్ ను నిరసిస్తూ మంగళవారం హుజురాబాద్ గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడన్నలు నిరసనకు నడుము కట్టారు. 22వ రోజులుగా డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా ప్రజా నిరసన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వమైనా ప్రజా వ్యతిరేక చర్యలను చేపట్ట రాదని ప్రజా ఆరోగ్యానికి నష్టం కలిగించే డంపింగ్ యార్డ్ ను రద్దు చేయాలన్నారు. రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు మాట్లాడుతూ.. ప్రాజాభీ ప్రాయానికనుగనంగా తక్షణమే స్పందించి డంపింగ్ యార్డుకు నిలిపివేస్తూవారంలోగా అధికార ప్రకటన చేయాలని పోలాడి డిమాండ్ చేశారు లేకుంటే ఉద్యమం ఉదృతి చేసి ప్రభుత్వ కార్యాలయాలను ముట్లడిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంఈఓ వీరస్వామి గౌడ్, గౌడ సంఘ నాయకులు తాళ్ల పెళ్లి రమేష్ గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కొయ్యడ కమలాకర్ గౌడ్, పీ రామ్ శంకర్ గౌడ్, పీ సదానందం గౌడ్, చింత శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు తాళ్లపల్లి రమేష్ గౌడ్, పంజాల మనోజ్ గౌడ్, పీ శ్రీధర్,కే సారయ్య, అఖిలపక్ష నాయకులు వేల్పుల రత్నం, ఈశ్వర్ రెడ్డి, గుడిపాటి జయపాల్ రెడ్డి, సి హెచ్ జనార్ధన్, కే సమ్మయ్య, పీ అమరేందర్ తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న రిటైర్డ్ ఎంఈఓ వీరస్వామి గౌడ్..

ఒకరోజు నిరసన దీక్షలో పాల్గొన్న గౌడ సంఘం నాయకులు, కార్యకర్తలు..

గౌడ సంఘం దీక్షకు మద్దతు తెలుపుతున్న ఓసి జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!