Social 1080×1350 • Multi-page
14-04-2026 BREAKING NEWS 11:57 PM
swarnodayam.com
Telugu Daily News

అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..ఆనందాన్ని వ్యక్తపరిచిన అంగన్వాడి టీచర్లు.

అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..ఆనందాన్ని వ్యక్తపరిచిన అంగన్వాడి టీచర్లు.
IMG_20260414_234929

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ నియోజకవర్గంలోని హుజురాబాద్ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని హుజురాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండలాల పరిధిలోని గ్రామాలలో సేవలందిస్తున్న అంగన్వాడీ టీచర్లకు హుజురాబాద్ కేసీ క్యాంపులో మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ… హుజురాబాద్ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడి టీచర్ల సేవలు అభినందనీయమని, అంగన్వాడి కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, ప్రీ స్కూల్ పిల్లలు ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్నారని, అంగన్వాడీ టీచర్లు గ్రామ గ్రామాన సేవలంచడంలో పారదర్శకతను కలిగి ఉండాలని, గ్రామాలలో సేవ చేయడం వరమని, మహిళలకు మాతృత్వం ఓ వరమని, గత ప్రభుత్వ హయాంలో కెసిఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా సేవలందిస్తూ, పాలు, గుడ్లు, సంపూర్ణ ఆహారం, బాలామృతం, కురుకురేలు లబ్ధిదారులకు సేవలు అందిస్తున్న అంగన్వాడి టీచర్లకు ఆన్లైన్ సేవల కొరకు గతంలో కెసిఆర్ అందజేయడం జరిగిందని, చాలా రోజుల తర్వాత స్మార్ట్ ఫోన్లు ఇప్పుడు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ సిడిపిఓ సుగుణ, సూపర్వైజర్లు, ఆఫీస్ సిబ్బంది, హుజురాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండలాలకు చెందిన అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

మాట్లాడుతున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!