Social 1080×1350 • Multi-page
15-04-2026 BREAKING NEWS 10:07 PM
swarnodayam.com
Telugu Daily News

వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. – హుజురాబాద్ లో బైక్ ర్యాలీలో ఏంవీఐ కంచి వేణు

వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. – హుజురాబాద్ లో బైక్ ర్యాలీలో ఏంవీఐ కంచి వేణు
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని హుజురాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచి వేణు అన్నారు. బుధవారం హుజురాబాద్ కేసీ క్యాంప్ లోని ఎంవిఐ కార్యాలయం నుండి హెల్మెట్లు పెట్టుకొని మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి ఎంవిఐ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…
రోడ్డు భద్రత అంటే భయం కాదు, బాధ్యత.
మన ఒక్క క్షణం నిర్లక్ష్యం ఎవరో ఒకరి జీవితాన్ని శాశ్వతంగా అంధకారం అవుతుంది చెప్పారు.
వేగంగా వెళ్లడం గొప్పతనం కాదు, సురక్షితంగా చేరడమే నిజమైన విజయం అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ నియమాలకోసం కాదు, మన కుటుంబాల చిరునవ్వుల కోసం అని అన్నారు. రహదారి ప్రమాదాల సమయంలో తలకు తగిలే తీవ్రమైన గాయాల నుండి హెల్మెట్ రక్షణ కల్పిస్తుందనీ, పరిశోధనల ప్రకారం ఇది తల గాయాలను దాదాపు 48% వరకు తగ్గిస్తుందన్నారు.
మెదడుకు రక్షణ: ప్రమాదంలో తల నేలకు తగిలినప్పుడు కలిగే ప్రభావాన్ని హెల్మెట్ గ్రహించి, మెదడుకు గాయం కాకుండా కాపాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ కానిస్టేబుల్ కత్తుల నాగరాజు, హోంగార్డ్ బుర్ర సురేష్ గౌడ్, వాహనదారులు పాల్గొన్నారు.

జెండా ఊపి ర్యాలీ నీ ప్రారంభిస్తున్న ఎంవిఐ వేణు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!