Social 1080×1350 • Multi-page
16-04-2026 BREAKING NEWS 12:07 AM
swarnodayam.com
Telugu Daily News

ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడువన్నాల శివాజీ ఆధ్వర్యంలో డంపు యార్డ్ రద్దుకై నిరవధిక దీక్ష

ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడువన్నాల శివాజీ ఆధ్వర్యంలో డంపు యార్డ్ రద్దుకై నిరవధిక దీక్ష
IMG-20260415-WA0123

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద గత 24 రోజులుగా వేస్ట్ టు ఎనర్జీ పవర్ రైట్ నిర్మాణ రద్దు కొరకై నిరవధిక దీక్ష కొనసాగిస్తున్న అఖిలపక్ష జేఏసీ మద్దతుగా ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు
వన్నాల శివాజీ ఆధ్వర్యంలో హుజురాబాద్ మండలంలోని 20 గ్రామాల ఉపసర్పంచులు అందరూ వేస్ట్ టు ఎనర్జీ పవర్ ప్లాంట్ రద్దు కొరకై మద్దతుగా సంఘీభావం తెలుపుతూ ఒక్కరోజు దీక్షలో కూర్చోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షులు మాట్లాడుతూ వేస్ట్ టు ఎనర్జీ పవర్ ప్లాంట్ డంపింగ్ యార్డ్ రద్దు అయ్యేంతవరకు మేమంతా అనగా ఉప సర్పంచ్ గా ఉప సర్పంచ్ల అందరము మండలంలోని అన్ని గ్రామాల ఉపసర్పంచులు ఏకస్తులమై మా వంతు కృషిగా ప్రభుత్వానికి శాంతియుతంగా పై అధికారులకు ఈ జటిలమైన సమస్యని తెలిపి డంపింగ్ యార్డ్ రద్దయ్యేంతవరకు పోరాటం చేస్తామని తెలిపారు. డంపింగ్ యార్డ్ రద్దు అయ్యే వరకు పోరాటం చేస్తామని తెలుపుతున్నామన్నారు.
మద్దతుగా మండలంలోని ఉప సర్పంచ్లు మండ సతీష్, శనిగరపు ఐలయ్య, గీసిడి శైలజా మహేందర్ రెడ్డి, బండి రాజు, బండి నరేష్, జనగామ రాజేశ్వరరావు, ఇప్పలపల్లి రామకృష్ణ, గిన్నారపు మహేందర్, బొల్లవేణి అజయ్, ఆవుల రాజకుమార్, నేరెళ్ల శ్రీనివాస్, జడల అశోక్ కుమార్, ఆవుల సంపత్, కాశిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, నారాయణరెడ్డి, బిక్షపతి, జాలి బలరాంరెడ్డి, పంజాల రాజు, సుధాకర్ లతో పాటు అఖిలపక్ష జేఏసీ సభ్యులు జనార్ధన్, సందేల వెంకన్న, హనుమంతరావు, జైపాల్ రెడ్డి, సీనియర్ టిఆర్ఎస్ నాయకులు కొండల్ రెడ్డి, కాట్రపల్లి మాజీ సర్పంచ్ తొగరు బిక్షపతి పాల్గొని మద్దతు తెలిపి స్థానిక తహసిల్దార్ కు మెమోరాండం
ఇవ్వడం జరిగింది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!