Social 1080×1350 • Multi-page
16-04-2026 BREAKING NEWS 12:24 AM
swarnodayam.com
Telugu Daily News

రైతుల డిమాండ్ల సాధనకు రెండు లక్షల మందితో సమరభేరిరైతు వ్యతిరేక విధానాలకు నిరసన సభకు హాజరు కావాలని కోరుతూ రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.

రైతుల డిమాండ్ల సాధనకు రెండు లక్షల మందితో సమరభేరిరైతు వ్యతిరేక విధానాలకు నిరసన సభకు హాజరు కావాలని కోరుతూ రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.
IMG_20260416_001447

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇచ్చిన హామీల మేరకు అన్నదాతల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఓసి ఐకాస రైతు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్ లో ఈనెల 28 నరెండు లక్షల మందితో నిర్వహించే రాష్ట్ర స్థాయి రైతుల మహా గర్జన సమర భేరి సభకు హాజరు కావాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, రాష్ట్ర ప్రథాన కార్యదర్శి మాజీ ఎంఎల్ సి నారదాసు లక్ష్మణ్ రావును, .మాజీ మేయర్ రవీందర్ సింగ్ ను, మాజీ మేయర్, ప్రస్తుత డిప్యూటీ మేయర్ వై.సునీల్ రావును,
రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బోయినపల్లి నరసింగరావు, చలిమెడ మెడికల్ కళాశాల ఆస్పత్రి ల చైర్మన్ చలిమెడ లక్ష్మీ నరసింహరావులను బుధవారం కరీంనగర్లో నాయకులతో కలిసి వారిని సమర భేరి సభకు హాజరు కావాలని కోరుతూ రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలను అందించి రైతుల సమర భేరి సమావేశానికి సహకరించాలని రామారావు కోరగా స్పందించి సభకు మద్దతు ప్రకటించి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారని రామారావు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్య
వైఖరి విడనాడి వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు.
రెండు లక్షల ఋణ మాఫీ లో 30 శాతం మందికే చేసిన ప్రభుత్వం అర్హులైన మిగతా 70 శాతం రుణమాఫీ ఎందుకు పూర్తి చేయడం జరిగింది రామారావు ప్రశ్నించారు. అన్ని పంటలకు 500 రూ బోనస్ ఇస్తామని ఎందుకు కొంతమేరకు సన్న రకాలకు ఇస్తున్నారు ఫీజు రీయింబర్స్ మెంట్ ఎందుకు నిలిచి జాబ్ క్యాలెండర్ ఎక్కడ అని పోలాడి ప్రశ్నించారు. నామ మాత్రంగానే ఓసి కార్పొరేషన్లను ప్రకటించిన ప్రభుత్వం వాటికి పాలక మండలి ఏర్పాటు చేయకుండా చట్ట బద్ధత కల్పించక నిదులు ఎందుకు కేటాయించ లేదు.
గతంలో ఉన్న పాల ఉత్పత్తి దారులకు లీటరుకు రూ 4రూపాయల రాయితీ ఎందుకు నిలిపి వేశారని ప్రశ్నల వర్షం కురిపించారు. రైతులను నిలువు దోపిడి చేస్తున్న ప్రైవేట్ సీడ్ కంపెనీల యాజమానుల ఆగడాలను ఎందుకు అరి కట్టడం లేదు. ఇచ్చిన హామీల మేరకు జాబ్ క్యాలెండర్ ఎక్కడ అని యువతకు ఉద్యోగావకాశాలు ఎప్పుడు కల్పిస్తారు అని రామారావు ప్రశ్నించారు.
ఈ నెల 28న కరీంనగర్ లో రైతు ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రెండు లక్షల మందితో రాష్ట్రస్థాయి రైతుల మహా గర్జన సమర భేరి సభను పార్టీల కతీతంగా చారిత్రాత్మకంగా నిర్వహిస్తామని పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కదలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!