Social 1080×1350 • Multi-page
16-04-2026 BREAKING NEWS 12:32 AM
swarnodayam.com
Telugu Daily News

ఆర్టిజన్ ఉద్యోగుల సమ్మెకు సిఐటియు సంఘీభావం

ఆర్టిజన్ ఉద్యోగుల సమ్మెకు సిఐటియు సంఘీభావం
IMG-20260416-WA0020

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తమ సమస్యల పరిష్కారం కోసం 8 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న
తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు బుధవారం సిఐటియు నాయకులు సంఘీభావం ప్రకటించారు. విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఆర్టిజన్లు చేస్తున్న సమ్మె శిబిరం వద్ద సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ సంఘీభావం ప్రకటించి అనంతరం ఆయన మాట్లాడుతూ… విద్యుత్ సంస్థలో పని చేస్తున్న ఆర్టీజన్, అన్,మ్యాన్ పీస్ రేటు కార్మికుల కోరికలు సమంజసం అని అన్నారు. వారి కోర్కెలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన అన్నారు. ఎనిమిది రోజులు అవుతున్నా ప్రభుత్వం వారిని చర్చలకు పిలవకపోవడం దారుణమన్నారు. వృత్తిలో భాగంగా ఆర్టిజన్లు మరణిస్తున్నారని వారి కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ నాయకులు,, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సాగర్ల కుమార్ పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!