Social 1080×1350 • Multi-page
16-04-2026 BREAKING NEWS 10:22 PM
swarnodayam.com
Telugu Daily News

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు..- ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. -ఎంఈఓ శ్రీనివాస్

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు..- ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. -ఎంఈఓ శ్రీనివాస్
IMG_20260416_221614

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: విజ్ఞాన అభివృద్ధికి గ్రంథాలయాలు ఉపయోగపడతాయని, గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలనీ హుజురాబాద్ ఎంఈఓ విడపు శ్రీనివాస్ అన్నారు. గురువారం హుజురాబాద్ గ్రంధాలయంలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యార్థినీ విద్యార్థులకు గ్రంథాలయాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గ్రంథాలయాల ఉపయోగించుకోవాలని అన్నారు. గ్రంథాలయ ఉద్యమానికి ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవాలని కోరారు. గ్రంథాలయాల వల్ల విజ్ఞానం పొందవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి, లైబ్రేరియన్ కనకలక్ష్మి, రిటైర్డ్ హెచ్ఎం వేల్పుల రత్నం , చందుపట్ల జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఏంఈవో శ్రీనివాస్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!