Social 1080×1350 • Multi-page
17-04-2026 BREAKING NEWS 01:16 PM
swarnodayam.com
Telugu Daily News

డయాలసిస్ సెంటర్ లు మంజూరు పట్లా సీఎం, మంత్రులకు, పార్టీ ఇంచార్జి ప్రణవ్ కు కాంగ్రెస్ నేతల పాలాభిషేకం.

డయాలసిస్ సెంటర్ లు మంజూరు పట్లా సీఎం, మంత్రులకు, పార్టీ ఇంచార్జి ప్రణవ్ కు కాంగ్రెస్ నేతల పాలాభిషేకం.
IMG-20260417-WA0034

ఏళ్ల తరబడి నిరీక్షణకు మోక్షం..

తీరనున్న డయాలసిస్ బాధితుల కష్టాలు..

హుజురాబాద్,జమ్మికుంట,కమలాపూర్ మూడు పి.హెచ్.సి లో డయాలసిస్ సెంటర్ లు..

చారిత్రక నిర్ణయానికి నాంది పలికిన ప్రణవ్…

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య విషయంలో పేద జీవితాలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటున్నామని, డయాలసిస్ రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పెరిగిన ఖర్చులకు అనుగుణంగా వారు సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్లి డయాలసిస్ చేసుకోవడం ఇబ్బందిగా ఉందని గమనించి వారికి ఇబ్బందులు తలెత్తకుండా జమ్మికుంట, కమలాపూర్ దవాఖానలో డయాలసిస్ సెంటర్ లు హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ మంజూరు చేయించడం జరిగిందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. శుక్రవారం నాడు హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపూర్ పట్టణంలోని ప్రధాన కూడళ్లలో డయాలసిస్ కేంద్రాలు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా మంత్రులు, ఇంచార్జి మంత్రులకు,హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇదొక చారిత్రక నిర్ణయమని, పేదలు పరిస్థితి బాగోలేక వ్యాధి బారిన పడితే సుదూర ప్రాంతాలకి వెళ్లి చికిత్స చేసుకోవడం ఇబ్బందిగా మారిందని, ఇప్పుడు ఈనిర్ణయం వల్ల కేవలం హుజురాబాద్ ప్రాంతమే కాకుండా చుట్టు పక్కన ఉన్న ప్రాంతాల ప్రజలకు కూడా ఉపయోగపడుతుందని అన్నారు. వైద్య విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంటుందని ఆసుపత్రుల మౌలిక సదుపాయాల కోసం నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ జమ్మికుంట, హుజూరాబాద్ ప్రధాన ఆసుపత్రులకు చెరొక 15 లక్షలు కేటాయించారని, ఇప్పుడు ఈ సెంటర్లు మంజూరు చేయించారని వారికి హుజూరాబాద్ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, కౌన్సిలర్లు, మార్కెట్ చైర్మెన్, హనుమాన్ దేవస్థాన చైర్మెన్, పట్టణ, మండల అధ్యక్షులు, మహిళా అధ్యకురాల్లు, సీనియర్ నాయకులు, మైనారిటీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

డయాలసిస్ సెంటర్ లు మంజూరు పట్లా సీఎం, మంత్రులకు, పార్టీ ఇంచార్జి ప్రణవ్ కు పాలాభిషేకం చేస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు..

కమలాపూర్ మండల కేంద్రంలో…

జమ్మికుంట మండల కేంద్రంలో..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!