Social 1080×1350 • Multi-page
17-04-2026 BREAKING NEWS 11:24 PM
swarnodayam.com
Telugu Daily News

మహిళా 33% రిజర్వేషన్ బిల్లుకు బ్రేక్!.. – విగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు.

మహిళా 33% రిజర్వేషన్ బిల్లుకు బ్రేక్!.. – విగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు.
IMG-20260417-WA0134

స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్, ఏప్రిల్ 17:
భారతదేశ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మార్పుకు నాంది పలుకుతూ కేంద్ర ప్రభుత్వం 2026 ఏప్రిల్ 16న పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో మూడు కీల క బిల్లును ప్రవేశపెట్టింది దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ బిల్లులు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనానికి చర్చకు దారితీసాయి, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, నియోజక వర్గాల పునర్విభజనకు సంబంధించి 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభ లో వీగిపోయింది.

ఈ బిల్లుకు అనుకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు. మొత్తం 528 మంది ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇందులో 352 ఓట్లు రావాల్సి ఉండగా.. మూడింట రెండింతల మెజార్టీ సాధించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. దీంతో మిగతా రెండు బిల్లులు నియోజకవర్గాల పునర్విభజన బిల్లు-2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు- 2026లను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది.

బిల్లు వీగిపోవడంతో లోక్‌ సభ నియోజకవర్గాలను 850కి పెంపునకు బ్రేక్‌లు పడ్డాయి. ఓటింగ్ ముగియడంతో స్పీకర్ సభను శనివారానికి వాయిదా వేశారు. రాజ్యాంగ సవరణ బిల్లును ఓడించినందుకు ప్రతిపక్షాలపై కిరణ్ రిజిజు విమర్శలు గుప్పించారు. మహిళా రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. రాజ్యాంగ సవరణ బిల్లులు ఆమోదం పొందాలంటే సభకు హాజరై ఓటు వేసిన వారిలో మూడింట రెండు వంతుల ప్రత్యేక మెజారిటీ అవసరం. లోక్‌సభలో 537 మంది సభ్యులు ఉండగా..

మూడింట రెండు వంతుల మెజారిటీకి 360 సీట్లు అవసరం. 293 మంది సభ్యులున్న అధికార ఎన్డీ ఏకు 67 సీట్లు తక్కువగా ఉన్నాయి. రాజ్యసభలో మెజారిటీకి కావలసిన కీలక సంఖ్య 163 కాగా, 142 మందికి పైగా సభ్యు లున్న ఎన్డీఏకు మెజారిటీ మార్కుకు 21 సీట్లు తక్కువగా ఉన్నాయి. గురువారం ప్రవేశపెట్టిన మూడు బిల్లులపై చర్చ అనంతరం.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్ర వారం వివరణ ఇచ్చారు. బిల్లును గంటలోనే మార్పు లు సభలో ప్రవేశపెడితే మద్దతు ఇస్తారా? అని ఆయన ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.

లోక్‌సభ, రాష్ట్రాల ఆసెంబ్లీ స్థానాల పెంపునకు నియో జకవర్గాల పునర్విభజన బిల్లును కేంద్రం తీసుకొ చ్చింది. ప్రస్తుత 543 స్థానాలు ఉండగా.. వాటిని 850కి పెంచాలని యోచించారు. కానీ, దక్షిణాది రాష్ట్రాలకు దీని వల్ల అ న్యాయం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమైంది. మోదీ ప్రభుత్వం మాత్రం ఎవరికీ అన్యాయం జరగదని, వారికి ప్రాధాన్యత పెరుగుతుందని చెప్పింది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!