Social 1080×1350 • Multi-page
18-04-2026 BREAKING NEWS 03:52 PM
swarnodayam.com
Telugu Daily News

రైతుల డిమాండ్ల సాధనకు 28న 2లక్షల మందితో రాష్ట్ర వ్యాప్త రైతు మహాగర్జన సమర భేరి. – రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.

రైతుల డిమాండ్ల సాధనకు 28న 2లక్షల మందితో రాష్ట్ర వ్యాప్త రైతు మహాగర్జన సమర భేరి. – రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.
IMG_20260418_154441

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతులకు ఇచ్చిన హామీలు, డిమాండ్ల సాధనకు రెండు లక్షల మందితో ఈనెల 28న కరీంనగర్ లో రైతుల మహాగర్జన సమర భేరి సభను పార్టీల కతీతంగా నిర్వహిస్తున్నట్లు రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఓసి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డిలు పేర్కొన్నారు. శనివారం హిమాయత్ నగర్ లో సమర భేరి సభ విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్ల పై ఓసి ఐకాస, రైతు ప్రజాసంఘాల జాతీయ రాష్ట్ర కమిటీల సమావేశాన్ని నిర్వహించి గోడ ప్రతులను ఆవిష్కరించి వివిధ జిల్లాల బాధ్యులతో సమీక్షించారు. ప్రచార సామగ్రి కర పత్రాలను గోడ ప్రతులను అందజేశారు.
ముందుగా బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావును హైదరాబాద్ లో వారి నివాసంలో నాయకులతో కలిసి ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఆహ్వాన పత్రం అందించి కేటిఆర్ చే గోడ ప్రతులను ఆవిష్కరించి మద్దతు ఇవ్వాలని కోరగా అందుకు కేటిఆర్ సానుకూలంగా స్పందించారని సమావేశంలో తెలిపారు .
పోలాడి రామారావు మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపులు తగ్గించడమే కాకుండా కౌలు రైతులకు ఇచ్చిన హామీల అమలును పూర్తిగా విస్మరించారని, అన్ని రకాల పంటలకు రూ.500 బోనస్ ఇవ్వకుండా కేవలం సన్న రకాలకు మాత్రమే అర కొరగా ఇస్తూ మిసాగిస్తోందని విమర్శించారు. ఇప్పటికే రెండు సార్లు రైతు భరోసా నిధులను ఎగ్గొట్టిన ప్రభుత్వం నామ మాత్రంగానే నిదులు విడుదల చేసి మభ్య పెడుతొందని మండి పడ్డారు.
అన్నదాతలకు, విద్యార్థులకు, వివిధ కుల సంఘాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి విడనాడాలని డిమాండ్ చేశారు ఓసి, ఇతర సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈనెల 28న ఓసి జేఏసీ, రైతు ప్రజాసంఘాల సంయుక్తాద్వర్యంలో లక్షలాది మందితో రాష్ట్ర స్థాయి రైతుల మహా గర్జన సమర భేరి సభను రాజకీయాల కతీతంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
సమావేశంలో రైతు ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ గుమ్మదవెల్లి శ్రీనివాస్, ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, ఓసి జేఏసీ గౌరవ అధ్యక్షులు గంగు ఉపేంద్రశర్మ, రాష్ట్ర ఉపాధ్యక్షులు పెండ్యాల రాంరెడ్డి, వివిధ జిల్లాల రైతు ప్రజాసంఘాల నాయకులు గోళ్ళ రాధాక్రిష్ణ మూర్తి, మాశెట్టి వరప్రసాద్, బోయినపల్లి నర్సింగా రావు,, తాళ్ళ పల్లి రమేష్.రాయపూడి రవికుమార్ బూర్ల పుల్లా రావు తదితరులు ఉన్నారు.

కేటిఆర్ చే గోడ ప్రతులను ఆవిష్కరించి మద్దతు ఇవ్వాలని కోరగా

నాయకులచే గోడ ప్రతులను ఆవిష్కరించి మద్దతు ఇవ్వాలని కోరుతున్న ఓసి జేఏసీ జాతీయ అధ్యక్షుడు రామారావు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!