Social 1080×1350 • Multi-page
18-04-2026 BREAKING NEWS 07:02 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ మున్సిపల్ లో ఆకట్టుకున్న అంగన్వాడి ప్రీస్కూల్ మేళ

హుజురాబాద్ మున్సిపల్ లో ఆకట్టుకున్న అంగన్వాడి ప్రీస్కూల్ మేళ
IMG-20260418-WA0138

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో అంగన్వాడి ప్రీస్కూల్ మేళ నిర్వహించగా చిన్నారులు ఆటపాటలతో అలరించారు. పోషణ పఖ్వాడ్ లో భాగంగా సిడిపిఓ సుగుణ మాట్లాడుతూ.. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పౌష్టికాహారం తీసుకోవాలని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని హాజరై చిన్నారులకు అంగన్వాడి ప్రోగ్రెస్ కార్డులను అందజేసి ప్రశంసించారు. అలాగే ప్రభుత్వం నుండి వచ్చిన స్మార్ట్ ఫోన్లు అంగన్వాడి టీచర్లకు అందజేశారు. అంగన్వాడి సెంటర్లను ఆదర్శంగా నిలపాలని, పిల్లల ఎదుగుదలకు పోషక ఆహారం అందజేసి చిన్నారులను అన్ని రకాలుగా తీర్చిదిద్దలన్నారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ రమ్య, బ్లాక్ కో ఆర్డినేటర్ నాగరాజు, గర్భిణీలు, బాలింతలు,తల్లులు, అంగన్వాడీ టీచర్లు, మెప్మా ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.

ఫ్రీ స్కూల్ మేళ నిర్వహిస్తున్న దృశ్యం..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!