Social 1080×1350 • Multi-page
18-04-2026 BREAKING NEWS 07:22 PM
swarnodayam.com
Telugu Daily News

27వ రోజు కొనసాగిన నిరసన దీక్షలు

27వ రోజు కొనసాగిన నిరసన దీక్షలు
IMG-20260418-WA0161

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద డంపింగ్ యార్డ్ రద్దు కోసం అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో శనివారం 27వ రోజు రియల్ ఎస్టేట్ వ్యాపారుల అసోసియేషన్ సభ్యులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. డంపింగ్ యార్డ్ ఏర్పాట్లు నిరసిస్తూ 27 రోజులుగా ప్రజలు వివిధ రూపాల్లో తమ నిరసనలు తెలుపుతున్నారని ఇది ప్రభుత్వానికి తెలియడం లేదా అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే డంపింగ్ యార్డ్ ను వెంటనే మానుకోవాలని హెచ్చరించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి తాసిల్దారు నరేందర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బండారు సదానందం, కొయ్యడ రమేష్, ధనవర్ష రాజు, ఆర్ కే రమేష్, కొండ గణేష్, ఇస్మాయిల్, తిప్పారపు భువనచంద్ర, ముక్క రమేష్, మొకిలి శ్రీనివాస్, కోలిపాక రమేశ్, ఇప్పలపల్లి చందు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, కాన్సిలర్ లు సొల్లు సునీత, బండ సింధుజ, సర్పంచ్ లు వంతడుపుల కస్తూరి, కటుకూరి మల్లారెడ్డి, నాయకులు సొల్లు బాబు, పుల్ల రాధ, పంజాల జ్యోతి, ఈశ్వర్ రెడ్డి, గుడిపాటి జయపాల్ రెడ్డి, చందుపట్ల జనార్ధన్, వేల్పుల రత్నం, డాక్టర్ శేఖర్, సమ్మయ్య, లక్ష్మణమూర్తి, రవీందర్, ప్రభాకర్, తునికి సమ్మయ్య, వెంకన్న, గోపగాని ఐలయ్య, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

నిరసన దీక్ష చేపట్టిన ఎస్టేట్ వ్యాపారుల అసోసియేషన్ సభ్యులు.. మాట్లాడుతున్న రాజపల్లి సర్పంచ్ మల్లారెడ్డి

మాట్లాడుతున్న చేల్పూర్ సర్పంచ్ వీ కస్తూరి..

తాసిల్దార్ నరేందర్ కు వినతి పత్రం అందజేస్తున్న నిరసన దీక్ష పరులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!