Social 1080×1350 • Multi-page
19-04-2026 BREAKING NEWS 11:46 PM
swarnodayam.com
Telugu Daily News

డంపింగ్ యార్డ్ రద్దు కోసం అర్ధనగ్న ప్రదర్శన.. – సోషల్ వారియర్లు ఆధ్వర్యంలో నిరసన

డంపింగ్ యార్డ్ రద్దు కోసం అర్ధనగ్న ప్రదర్శన.. – సోషల్ వారియర్లు ఆధ్వర్యంలో నిరసన
IMG-20260419-WA0176

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటు చేయ తలపెట్టిన డంపింగ్ యార్డ్ ను రద్దు చేయాలని కోరుతూ ఆదివారం హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అర్ధ నగ్నంగా ప్రదర్శన చేశారు. పలువురు సోషల్ వారియర్లు, ప్రజా సంఘాల నాయకులు, యువకులు, ప్లకార్డులు చేతపట్టి డంపింగ్ యార్డ్ ఏర్పాటును నిరసిస్తూ అర్థనగ్నంగా రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రజలు వద్దు అని చెప్తున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు హుజురాబాద్ లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని చూస్తుందన్నారు. ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటాయని పంటలు నష్టపోతాయని నీరు కాలుష్యం అవుతుందని పశువులు చనిపోతాయని చెబుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని వారి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కొలిపాక సమ్మయ్య, వేల్పుల ప్రభాకర్, సోషల్ మీడియా వారియర్లు కోయల్ కార్ శ్యామ్, పిట్టల శ్రీనివాస్, తాటిపాముల రాము, కాసగోనీ కిరణ్, అనిల్, సాయి, శివాజీ, తులసి లక్ష్మణమూర్తి, సందెల వెంకన్న, చందుపట్ల జనార్ధన్, గుడిపాటి జయపాల్ రెడ్డి, అజ్జు, రియాజ్, పిల్లి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

అర్థనగ్నంగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న సోషల్ వారియర్లు, ప్రజా సంఘాల నాయకులు, యువకులు

మాట్లాడుతున్న సోషల్ వారియర్ కోయల్ కార్ శ్యామ్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!