Social 1080×1350 • Multi-page
20-04-2026 BREAKING NEWS 11:00 AM
swarnodayam.com
Telugu Daily News

వడదెబ్బతో ఎలక్ట్రిషన్ ఆకస్మిక మృతి.

వడదెబ్బతో ఎలక్ట్రిషన్ ఆకస్మిక మృతి.
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: వడదెబ్బ బారిన పడి ఓ ఎలక్ట్రీషియన్ ఆకస్మికంగా మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లి గ్రామానికి చెందిన మంచికట్ల తిరుపతి (54) గత రెండు రోజులుగా నూతన భవన నిర్మాణంలో స్లాప్ పైన ఎలక్ట్రిషన్ పనిచేస్తూ వడదెబ్బ బారిన పడ్డారు. రాత్రి అనారోగ్యానికి గురికాగా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారన్నారు. రేక్కాడితే డొక్కాడని అ ఎలక్ట్రిషన్ తిరుపతి మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. మృతుడికి
భార్య మంచికట్ల రమాదేవి, కొడుకు మంచికట్ల రాము,
కూతుర్లు అర్చన, లక్ష్మీప్రసన్న ఉన్నారు. ప్రభుత్వం తరపున మృతి చెందిన ఎలక్ట్రీషియన్ తిరుపతి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. కాగా పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు మృతి చెందిన తిరుపతి పార్థివ దేహం వద్ద నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని వ్యక్తం చేశారు.

మంచికట్ల తిరుపతి (ఫైల్ ఫోటో)

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!