Social 1080×1350 • Multi-page
20-04-2026 BREAKING NEWS 07:32 PM
swarnodayam.com
Telugu Daily News

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా నేరెళ్ల మహేందర్ గౌడ్

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా నేరెళ్ల మహేందర్ గౌడ్
IMG-20260420-WA0106

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా నేరెళ్ల మహేందర్ గౌడ్ ను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. నేరెళ్ల మహేందర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కార్యకర్తగా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశాడు. గతంలో కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ మండల అధ్యక్షుడిగా పనిచేశాడు. మహేందర్ గౌడ్ సేవలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ జిల్లా అధికార ప్రతినిధిగా నియమించింది. అధికార ప్రతినిధిగా తనను నియమించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ లకు మహేందర్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా మహేందర్ గౌడ్ నియామకం పట్ల పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, హర్షం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా నియామకమైన నేరెళ్ల మహేందర్ గౌడ్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!