Social 1080×1350 • Multi-page
20-04-2026 BREAKING NEWS 08:55 PM
swarnodayam.com
Telugu Daily News

తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు. – ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.

తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు. – ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.
IMG-20260420-WA0147

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉంచిన ధాన్యాన్ని తరుగు పేరుతో అధికారులు ఇబ్బంది పెట్టరాదని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. సోమవారం హుజూరాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసినితో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
రైతులు కష్టపడి పండించిన పంటకు సరైన ధర లభించేలా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. అనవసరంగా కోతలు విధించకుండా న్యాయంగా కొనుగోళ్లు జరపాలని కోరారు. రైతులు మార్కెట్ యార్డ్‌కు తీసుకువచ్చిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని, తూకం, హమాలి, రవాణా, చెల్లింపుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వానికి ఆయన సూచించారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరిగినా సహించబోమని అన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రానికి ప్రారంభించి మాట్లాడుతున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గూడూరి రాజేశ్వరి, మార్కెట్ కార్యదర్శి పీ అశోక్, పలువురు డైరెక్టర్లు, ప్రజాప్రతితులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!