Social 1080×1350 • Multi-page
20-04-2026 BREAKING NEWS 11:25 PM
swarnodayam.com
Telugu Daily News

విజ్ఞాన్ స్కూల్ లో ఘనంగా ఎర్త్ డే (భూమి దినోత్సవ) వేడుకలు

విజ్ఞాన్ స్కూల్ లో ఘనంగా ఎర్త్ డే (భూమి దినోత్సవ) వేడుకలు
IMG-20260420-WA0165

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఏప్రిల్ 22న ఎర్త్ డే ను పురస్కరించుకొని సోమవారం రోజు హుజురాబాద్ పట్టణంలోని విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ స్కూల్ లో ఇంటర్నేషనల్ ఓమౌజయ యునైటెడ్ యంగ్ స్టార్స్ అసోసియేషన్ (I AUYSA) ఆధ్వర్యంలో ఎర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో I AUYSA పేరెంట్స్ కో ఆర్డినేటర్ ఎదులాపురం మొగలి, స్కూల్ అడ్వైజర్ ఏనుగు మహిపాల్ రెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొని మాట్లాడుతూ.. ఎర్త్ డే మనకు ఒక గ్లోబల్ మెసేజ్ ఇస్తుంది. భూమిని కాపాడటం అంటే మన భవిష్యత్తును కాపాడటం, ప్రతి ఒక్కరు చెట్లను నాటాలనీ, నీటిని ఆదా చేయాలనీ, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని పేర్కొన్నారు.

Oplus_16908288

స్కూల్ కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ యాదవ్ మాట్లాడుతూ భూమిని, పర్యావరణాన్ని కాపాడటం మనందరి బాధ్యత అని స్వచ్ఛమైన భూమిని భవిష్యత్ తరాలకు అందించడం మన బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 120 మంది విద్యార్థులకు సీడ్ బాల్స్ అందజేశారు. అదేవిధంగా స్కూల్ ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. అనంతరము IAUYSA పేరెంట్స్ కోఆర్డినేటర్ ఎదులాపురం మొగిలిని పాఠశాల మేనేజ్మెంట్ సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ & కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ యాదవ్, డైరెక్టర్ తిరుపతియాదవ్, IAUYSA JEMS జయతేజ, వింధ్యాప్రియ, లిఖిత, సాయిరాం నవ్య, దివ్య, నిఖిత, నాగ శివాని, ఉపాధ్యాయులు మరియు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

Oplus_16908288

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!