Social 1080×1350 • Multi-page
21-04-2026 BREAKING NEWS 05:32 PM
swarnodayam.com
Telugu Daily News

రూ.4.61 కోట్ల కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. -పథకాల పేర్లు మార్చినా పర్లేదు… – పేదల పథకాలు నిలిపివేయొద్దు. – ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

రూ.4.61 కోట్ల కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. -పథకాల పేర్లు మార్చినా పర్లేదు… – పేదల పథకాలు నిలిపివేయొద్దు. – ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
IMG-20260421-WA0179

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 461 మంది లబ్ధిదారులకు రూ.4,61,53,473 విలువైన కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ చెక్కులను హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పంపిణీ చేశారు.

లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చాయని అన్నారు. పథకాల పేర్లు మార్చినా పర్లేదు కానీ పేదలకు మేలు చేసే పథకాలను నిలిపివేయడం సరికాదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆడబిడ్డల భవిష్యత్తు కోసం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌తో పాటు తులం బంగారం ఇవ్వాలి అని ప్రభుత్వం కోరారు.

గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లు, ప్రసవం అనంతరం కేసీఆర్ కిట్లు అందించి పేద కుటుంబాలకు పెద్ద ఎత్తున సహాయం చేసినట్లు గుర్తు చేశారు. అలాంటి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు.

Oplus_16908288
Oplus_16908288

అదే విధంగా హుజురాబాద్‌లో ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్ ఏర్పాటుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే ప్రజల ఆరోగ్యం, పర్యావరణం, జీవన విధానం తీవ్రంగా దెబ్బతింటుందని అన్నారు. డంపింగ్ యార్డ్ రద్దు అయ్యే వరకు ప్రజలతో కలిసి ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కమలాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్, హైదరాబాద్, జమ్మికుంట మున్సిపల్ చైర్ పర్సన్ లు, ఇతర ప్రజాప్రతినిధులు, నాలుగు మండలాల తాసిల్దార్లు, ఎంపీడీవోలు, నాయకులు, అధికారులు, లబ్ధిదారులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడుతున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!