Social 1080×1350 • Multi-page
21-04-2026 BREAKING NEWS 09:51 PM
swarnodayam.com
Telugu Daily News

దివ్యాంగుల కార్యక్రమంలో ఉద్రిక్తత, తోపులాట. – ఇరు పార్టీల నాయకుల పోటాపోటీ నినాదాలు. – ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఎమ్మెల్యే ఆగ్రహం

దివ్యాంగుల కార్యక్రమంలో ఉద్రిక్తత, తోపులాట. – ఇరు పార్టీల నాయకుల పోటాపోటీ నినాదాలు. – ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఎమ్మెల్యే ఆగ్రహం
IMG-20260421-WA0241

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ కార్యక్రమంలో దివ్యాంగుల ఉచిత వాహనాల పంపిణీ కార్యక్రమంలో ఇరు పార్టీల నాయకులు పోటాపోటీ నినాదాలు చేయడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మంగళవారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఫంక్షన్ హాల్ మొదటి అంతస్తులో జరగగా గ్రౌండ్ ఫ్లోర్ లో దివ్యాంగుల ఉచిత వాహనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వచ్చారు. ఇదే సమయానికి అక్కడ హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ వోడితెల ప్రణవ్ బాబు ఉన్నారు. చాలా రోజుల తర్వాత ఇద్దరు నాయకులు ఎదురుపడడంతో ఒకరికొకరు కరచాలనం చేసుకున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు జై కాంగ్రెస్, ప్రణవ్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి… అంటూ నినాదాలు చేయడంతో దానికి ప్రతిగా బిఆర్ఎస్ నాయకులు సైతం కౌశిక్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి… జై బిఆర్ఎస్, కౌశిక్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు పార్టీల నాయకులు పోటాపోటీగా నినాదాలు చేసుకోవడంతో గందరగోళ వాతావరణ ఏర్పడి తోపులాట జరిగింది. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు పోలీసులు ఒక పార్టీకి చెందిన నాయకులను బయటకు పంపడంతో పరిస్థితి చెక్కబడింది.

పోటాపోటీగా నినాదాలు చేస్తున్న ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు..
–ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఎమ్మెల్యే ఆగ్రహం

దివ్యాంగుల ఉచిత వాహనాల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరగడంపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదు కదా..! ఏ హోదా లేని వ్యక్తిని ఎలా కార్యక్రమానికి ఆహ్వానిస్తారని ఆయన అన్నారు. మరోసారి ప్రోటో కాల్ ఉల్లంఘన జరిగితే సహించేది లేదన్నారు. కాగా అధికారులు మరోసారి ఇలా జరగదని వారన్నారు. అయితే అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేసుకోవడం, తోపులాట జరగడంతో కొంతసేపు ఉద్రిక్తత దారితీసింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఒక పార్టీకి చెందిన వారిని వెళ్లగొట్టడంతో శాంతించారు.

పోటా పోటీగా నినాదాలు చేస్తూ తోసుకుంటున్న ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!