Social 1080×1350 • Multi-page
22-04-2026 BREAKING NEWS 07:37 PM
swarnodayam.com
Telugu Daily News

మృతి చెందిన ఏజెంట్ కుటుంబానికి ఆర్థిక సహాయం

మృతి చెందిన ఏజెంట్ కుటుంబానికి ఆర్థిక సహాయం
IMG-20260422-WA0133

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎల్ఐసి ఏజెంట్ కుసుమ శ్రీనివాస్ కుటుంబానికి ఎల్ఐసి ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. జమ్మికుంటకు చెందిన కుసుమ శ్రీనివాస్ ఆదివారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఈ ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేసి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పంజాల ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి చందుపట్ల నరసింహారెడ్డి, డైరెక్టర్ కొండ తిరుపతి, సంఘ సభ్యులు వడ్డే రమేష్, నాగవెల్లి శ్రీనివాస్, బుచ్చి రాములు తదితరులు పాల్గొన్నారు.

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేస్తున్న ఎల్ఐసి నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!