Social 1080×1350 • Multi-page
24-04-2026 BREAKING NEWS 02:00 PM
swarnodayam.com
Telugu Daily News

శ్రీ వాసవిమాత జయంతి ప్రభుత్వమే అధికారికంగా జరపడం పట్ల సీఎం చిత్రపటానికి పాలాభిషేకం.

శ్రీ వాసవిమాత జయంతి ప్రభుత్వమే అధికారికంగా జరపడం పట్ల సీఎం చిత్రపటానికి పాలాభిషేకం.
IMG-20260424-WA0076

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: వాసవి జయంతిని తెలంగాణ రాష్ట్ర పండుగగా నిర్ణయించి ప్రభుత్వమే అధికారికంగా జరుపుకోవాలని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ హుజురాబాద్ కు చెందిన వైశ్య కుటుంబాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. హుజురాబాద్ లోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం ఆవరణలో ఈరోజు శ్రీ వాసవి మాత జయంతి సందర్భంగా ఇందుకుగాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వైశ్య కుటుంబాలు పాలాభిషేకం చేయడము జరిగింది. ఇందులో ఆర్యవైశ్య సంఘం హుజురాబాద్ పట్టణ అధ్యక్షుడు హరిశంకర్ మరియు వాసవి టెంపుల్ పూజారి శ్రీకాంత్ శర్మ, నాయకులు పున్నం చందర్, రాజేంద్రప్రసాద్ ,శ్రీనివాస్, కే హరిప్రసాద్, మాడిశెట్టి వీరన్న, గర్రెపల్లి శ్రీనివాస్, లచ్చన్న, శ్రీనాథ్, తాటిపల్లి రాజన్న తదితరులు పాల్గొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్న ఆర్యవైశ్య కుల సంఘం నాయకులు, కులస్తులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!