Social 1080×1350 • Multi-page
24-04-2026 BREAKING NEWS 08:01 PM
swarnodayam.com
Telugu Daily News

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ మృతికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. – బిఆర్ఎస్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎడవెల్లి కొండాల్ రెడ్డి

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ మృతికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. – బిఆర్ఎస్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎడవెల్లి కొండాల్ రెడ్డి
IMG-20260424-WA0128

—మృతుని కుటుంబానికి న్యాయం చేయాలి

—కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

—బిఆర్ఎస్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎడవెల్లి కొండాల్ రెడ్డి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ఆయన మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని బిఆర్ఎస్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎడవెల్లి కొండాల్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొండల్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చి దాదాపు రెండున్నరేండ్లు అవుతున్నా, అప్పటి నుంచి తమ సమస్యలు పరిషరించాలని ఆర్టీసీ కార్మికులు వేడుకుంటున్నా ప్రభుత్వం మొండివైఖరినీ అవలంభిస్తుందని విమర్శించారు. శంకర్ గౌడ్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు.

బిఆర్ఎస్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎడవెల్లి కొండాల్ రెడ్డి

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!