Social 1080×1350 • Multi-page
25-04-2026 BREAKING NEWS 01:04 PM
swarnodayam.com
Telugu Daily News

గుండెపోటుతో సీనియర్ పాత్రికేయుడు గన్ను శ్రీనివాస్ అకస్మిక మృతి. – ఆయన కుటుంబాన్ని పరామర్శించిన పాత్రికేయులు

గుండెపోటుతో సీనియర్ పాత్రికేయుడు గన్ను శ్రీనివాస్ అకస్మిక మృతి. – ఆయన కుటుంబాన్ని పరామర్శించిన పాత్రికేయులు
IMG-20260425-WA0044

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజూరాబాద్ మండలంలోని చెల్పూరు గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు గన్ను శ్రీనివాస్ (54) గుండెపోటుతో శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. హుజురాబాద్, జమ్మికుంటలకు చెందిన పాత్రికేయ మిత్రులు గన్ను శ్రీనివాస్ మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. పరామర్శించిన వారిలో హుజురాబాద్, జమ్మికుంట ప్రెస్ క్లబ్ ల అధ్యక్షులు కాయిత రాములు, నాయిని శ్రీనివాస్, స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ ఓనర్ మండల యాదగిరి, పాత్రికేయులు కేసిరెడ్డి నరసింహారెడ్డి, అనుమాస రాజేందర్, అల్లి నరేందర్, టేకుల సాగర్, పోతరాజు సంపత్, నాగవల్లి రాజు, నంబి భరణి కుమార్, సృజన్ తేజస్వి రాజ్, జమ్మికుంటకు చెందిన పలువురు సీనియర్ పాత్రికేయులు, తదితరులు ఉన్నారు. అయితే గన్ను శ్రీనివాస్ గతంలో చురకలు పత్రిక విలేకరిగా తన వృత్తిని ప్రారంభించి చాలా ఏళ్లు సాక్షి దినపత్రికలో పనిచేసి, కొంతకాలంగా తనే సొంత యూ ట్యూబ్ ఛానల్ పెట్టుకుని పాత్రికేయ వృత్తిని కొనసాగిస్తున్నారు. గత నాలుగేళ్ల క్రితం వృత్తిలో భాగంగా జమ్మికుంటకు ద్విచక్ర వాహనముపై వెళ్తూ ఒక్కసారిగా పంది వాహనానికి ఢీకొట్టడంతో కిందపడి తలకు తీవ్ర గాయమై కోమాలోకి వెళ్లి చావును ఎదిరించి జీవించాడు. తిరిగి నిన్న గుండెపోటుకు గురైన శ్రీనివాస్ ను జమ్మికుంట ఆసుపత్రికి తరలించే క్రమంలో ఎక్కడైతే గతంలో గాయపడి కోమాలోకి వెళ్ళాడో అదే చోట తుది శ్వాస విడవడం పలువురి కంటతడి పెట్టించింది. గన్ను శ్రీనివాస్ కు భార్య, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు.

గన్ను శ్రీనివాసు మృతదేహమ్ వద్ద పూలమాల ఉంచి, నివాళులర్పిస్తున్న హుజురాబాద్ ప్రెస్ క్లబ్ నాయకులు, సభ్యులు.

నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు:

సీనియర్ పాత్రికేయుడు గన్ను శ్రీనివాస్ అకస్మిక మృతితో హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రోంటాల సుహాసిని మనోజ్ రావు, చేల్పూర్ గ్రామ సర్పంచ్ వంతడుపుల కస్తూరి రఘు, మాజీ సర్పంచ్ పొలంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఇరుమళ్ళ రాణి సురేందర్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, పలువురు నేతలు, పలువురు అధికారులు ఎంతోమంది ఆయన ఇంటికి చేరుకొని మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు.

సీనియర్ పాతకేయుడు గన్ను శ్రీనివాస్ (ఫైల్ ఫోటో)

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!