Social 1080×1350 • Multi-page
25-04-2026 BREAKING NEWS 10:12 PM
swarnodayam.com
Telugu Daily News

డంపింగ్ యార్డ్ ను ప్రభుత్వం రద్దు చేయాలి.. – వికలాంగుల సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్.

డంపింగ్ యార్డ్ ను ప్రభుత్వం రద్దు చేయాలి.. – వికలాంగుల సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్.
IMG-20260425-WA0113

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పరిసర ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన డంపింగ్ యార్డ్ ను వెంటనే రద్దు చేయాలని వికలాంగుల సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద డంపింగ్ యార్డ్ వ్యతిరేక అఖిలపక్ష కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన దీక్షలో 34వ రోజు వారు పాల్గొన్నారు.

నిరసన దీక్షలో కూర్చున్న వికలాంగుల సంక్షేమ సంఘం నాయకులు, కార్యకర్తలు..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం డంపింగ్ యార్డ్ ను ఏర్పాటు చేయడం సరికాదన్నారు. ప్రజల ఆరోగ్యంకు ఇబ్బంది జరిగే పరిస్థితి ఉండడంతో ప్రభుత్వం తిరిగి దానిని రద్దు చేయాలని అన్నారు. ఈ నిరసన దీక్ష కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు కంకణాల రవీందర్ రెడ్డి, వికలాంగుల సంఘం నాయకులు చీకోటి వెంకటరమణ, మంతెన తిరుపతి, తాళ్లపెళ్లి అమరేందర్ గౌడ్, వంగ మల్లేష్ గౌడ్, మొగిలి, క్రాంతి కుమార్, అఖిలపక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తాసిల్దార్ కు వినతి పత్రం అందజేస్తున్న వికలాంగుల సంక్షేమ సంఘం నాయకులు, అఖిలపక్ష నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!