Social 1080×1350 • Multi-page
26-04-2026 BREAKING NEWS 06:59 PM
swarnodayam.com
Telugu Daily News

కిట్స్ అధ్యాపకురాలు గౌరీ దేశ్ పాండేకి డాక్టరేట్

కిట్స్ అధ్యాపకురాలు గౌరీ దేశ్ పాండేకి డాక్టరేట్
IMG-20260426-WA0142

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ece) విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ గౌరీ దేశ్ పాండే డాక్టరేట్ పట్టాను అందుకున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ శంకర్ తెలిపారు.
ఎస్సార్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్లు డాక్టర్ సందీప్ భట్టాచార్య, డాక్టర్ అజయన్ ల సంయుక్త మార్గదర్శకత్వంలో “ఇన్వెస్టిగేషన్ ఆన్ ఎంహ్యాన్సింగ్ డిసిఆర్ఎఫ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ నానో స్కేల్ ఏమి గ్యాన్ మోషం ఆన్ ఎస్ ఐ వే ఫర్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ ఆర్ఎస్ ఆమ్ప్లిఫైయర్” అనే అంశంపై పరిశోధన చేసినట్లు చెప్పారు. పరిశోధన పత్రాలను ఎస్సార్ విశ్వవిద్యాలయానికి సమర్పించగా డాక్టరేటు ను అందించిందన్నారు. ఈ సందర్భంగా గౌరీ దేశ్ పాండే ను ప్రిన్సిపల్ డాక్టర్ కందుకూరి శంకర్, కిట్స్ చైర్మన్ మాజీ ఎంపీ కెప్టెన్ వి లక్ష్మీకాంతరావు, కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మాజీ ఎమ్మెల్యే హుస్నాబాద్ వి సతీష్ కుమార్, కోశాధికారి వి ఇంద్రనీల్, విభాగాధిపతి డాక్టర్ బి రమేష్, కళాశాల డీన్ డాక్టర్ యోగేష్ పుండలిక్, కళాశాల రిజిస్టర్ డాక్టర్ రాజేశ్వరరావు, అధ్యాపకులు
అభినందించారు.

డాక్టరేట్ పొందిన కిట్స్ అధ్యాపకురాలు గౌరీ దేశ్ పాండే

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!