Social 1080×1350 • Multi-page
26-04-2026 BREAKING NEWS 11:13 PM
swarnodayam.com
Telugu Daily News

భక్తిశ్రద్ధలతో వాసవి మాత జయంతోత్సవ వేడుకలు

భక్తిశ్రద్ధలతో వాసవి మాత జయంతోత్సవ వేడుకలు
IMG-20260426-WA0178

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవంను పురస్కరించుకొని ఆదివారం హుజురాబాద్ పట్టణంలోని కన్యకా పరమేశ్వరి దేవాలయంలో జయంతి వేడుకలు భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారి జయంతిని పురస్కరించుకొని వేద పండితులు శ్రీకాంత్ శర్మ అభిషేకం, కుంకుమ పూజ, 108 కళశాలతో హారతి నిర్వహించి పారాయణం చేశారు. అమ్మవారి జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులకు దేవాలయ కమిటీ అన్న ప్రసాద వితరణ జరిపారు. అమ్మవారి జయంతిని పురస్కరించుకొని దేవాలయంలో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు, మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ చైర్మన్ కటకం శ్రీనివాస్, కమిటీ సభ్యులు శీల రాజేంద్రప్రసాద్, సుద్దాల హరిశంకర్, బళ్ళు పున్నoచందర్, నార్ల రాజేందర్, కొల్లూరి శ్రీకాంత్, రాజన్న, రావుల వెంకట్, మాడిశెట్టి వీరన్న, అక్కినపల్లి శ్రవణ్, రఘురామ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

అమ్మవారి లలితా పారాయణం చేస్తున్న మహిళ భక్తులు..

అతిథులు కాంగ్రెస్ నేత ప్రణవ్ బాబు, మున్సిపల్ చైర్మన్ సుహాసిని నీ సత్కరిస్తున్న ఆర్యవైశ్య సంఘం మహిళలు, నాయకులు..

అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్న ప్రజాప్రతినిధులు, నాయకులు

ఆలయం గురించి కాంగ్రెస్ నేత ప్రణవ్ కు వివరిస్తున్న ఆర్యవైశ్య సంఘం నాయకులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!