Social 1080×1350 • Multi-page
26-04-2026 BREAKING NEWS 11:38 PM
swarnodayam.com
Telugu Daily News

కలిసి పోరాడితేనే లక్ష్యం సాధిస్తాము. – డంపింగ్ యార్డ్ వ్యతిరేక అఖిలపక్ష కమిటీ

కలిసి పోరాడితేనే లక్ష్యం సాధిస్తాము. – డంపింగ్ యార్డ్ వ్యతిరేక అఖిలపక్ష కమిటీ
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రజల జీవితాలకు ముప్పు వాటిల్లే, పర్యావరణాన్ని దెబ్బతీసే డంపింగ్ యార్డ్ ఏర్పాటు కాకుండా ఉండేందుకు అన్ని పక్షాలు కలిసి పోరాడితేనే లక్ష్యం సాధించగలుగుతామని డంపింగ్ యార్డ్ వ్యతిరేక అఖిలపక్ష కమిటీ నాయకులు పి. ఈశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం హుజురాబాద్ లో ఆయన మాట్లాడుతూ… హుజురాబాద్ సిర్సపెల్లి మధ్యలో నెలకొల్పే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ రద్దుకై గత 35 రోజులుగా అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నిరసన దీక్షలో ఈ ప్రాంత ప్రజలు కుల సంఘాలు, ప్రజా సంఘాలు, రిటైర్మెంట్ ఉద్యోగ ఉపధ్యాయ సంఘాలు, ఆర్టీసీ కార్మిక సంఘాలు, వ్యాపార, వాణిజ్య సంఘాలు, ప్రెస్ క్లబ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఎల్ఐసి ఏజెంట్ల అషోసియేషన్, వికలాంగుల సంక్షేమ సంఘం ఇంకా అనేక సంఘాలు నిరవధిక నిరసన దీక్షలు, వివిధరకాల ప్రజాస్వామిక ఉద్యమాలను జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు. ఇంతమంది ఉద్యమాలు చేస్తున్న ఈ తరుణంలో కొన్ని రాజకీయ పక్షాలు పట్టించుకోకపోవడం మరికొన్ని రాజకీయ పార్టీలు విడిగా ఉద్యమాలు చేయడం డంపింగ్ యార్డ్ సమస్య పరిస్కారం కాకపోవడం బాధాకరం అన్నారు. ఇవి ప్రజా ఉద్యమాలను దెబ్బతీసే విధంగా కొనసాగుతున్నాయని అఖిలపక్ష కమిటీ భావిస్తున్నది. అన్ని రాజకీయ పక్షాలు కలిసి ఒక్కటిగా నిలిచి ఉద్యమించాలని, అప్పుడే WTE ప్లాంట్ రద్దు అయ్యే అవకాశం ఏర్పడుతుందని కమిటీ భావిస్తుందనీ అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించే బాధ్యత రాజకీయ పార్టీలకే ఉంటుంది, ఈ ప్రాంత ప్రజలు ఓట్లేస్తే గెలిచినారు హుజురాబాద్ ప్రాంత ప్రజలను రక్షించ వలచిన బాధ్యత వారిపై ఉంటుందని. ఈ ప్రాంత ప్రజల కోసం కాంగ్రెస్, టిఆర్ఎస్, బిజెపి, బీఎస్పీ, సిపిఐ, సిపిఎం, టిజెఎస్ కలిసి అఖిలపక్ష కమిటీతో కలిసి పోరాడాలని ఆయన కోరారు. డంపింగ్ యార్డు సమస్య రద్దు అయ్యే వరకు ప్రజా ఉద్యమాలు అందరం కలిసి నిర్మిద్దాం, దీనికోసం రాజకీయ నాయకుల్లారా! ఏకం కావాలని, హుజురాబాద్ ప్రజల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాం అని ఆయన అన్నారు. అన్ని పార్టీల నాయకుల, ప్రజా సంఘాల, కుల సంఘాల సమన్వయంతో త్వరలోనే మహాధర్నా ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో అఖిలపక్ష నాయకులు కట్కూరి మల్లారెడ్డి, వేల్పుల రత్నం, కోలిపాక సారయ్య, కొలిపాక సమ్మయ్య, సాదుల రవీందర్ బాబు, రామ్ రాజేశ్వర్, నిమ్మటూరి సాయికృష్ణ, భద్రయ్య, కొలిపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!