Telugu Daily News
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించం.- కాంగ్రెస్ పార్టీ అంటే క్రమశిక్షణకు మారు పేరు. – అఫ్సర్ పై చర్యలకు సిద్ధమైన హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ.. -పట్టణ అధ్యక్షుడు తిరుపతి.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని హుజురాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మేకల తిరుపతి అన్నారు. సోమవారం రోజున సోషల్ మీడియా వేదికగా పార్టీ ఇంచార్జిపై, ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేసిన హుజురాబాద్ 17వ వార్డుకు చెందిన కాంగ్రెస్ నేత మహమ్మద్ అఫ్సర్ పై చర్యలు తీసుకోవాలని కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మేడిపల్లి సత్యంకు ఫిర్యాదు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ లో ఉంటూ ఇతర పార్టీలకు లబ్ధి చేకూరెలాగా వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. ఇలాంటి చర్యలు ఎవరు చేసిన ఉపేక్షించమని తిరుపతి హెచ్చరించారు.

