Social 1080×1350 • Multi-page
28-04-2026 BREAKING NEWS 07:35 PM
swarnodayam.com
Telugu Daily News

బల్దియా ఉద్యోగులపై దాడి పట్ల నల్ల బ్యాడ్జీలతో నిరసన

బల్దియా ఉద్యోగులపై దాడి పట్ల నల్ల బ్యాడ్జీలతో నిరసన
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను ఖండిస్తూ, దాడికి పాల్పడ్డ వ్యక్తిని శిక్షించాలని హుజురాబాద్ మునిసిపాలిటీ ఉద్యోగులు మంగళవారం భోజన విరామ సమయంలో మున్సిపాలిటీ ఎదురుగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో మున్సిపల్ కార్పొరేటర్ భర్త మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ పై దాడి చేయడం జరిగిందని, దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఉద్యోగులకు కనీస భద్రత కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమoలో మున్సిపల్ మేనేజర్ రావుల భూపాల్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ నాయిని అశ్వినీగాంధీ, సానిటరీ ఇన్స్పెక్టర్ దరిపల్లి కిరణ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇల్లందుల రమేష్, జూనియర్ సహాయకులు మహమ్మద్ వలీ పాషా, తిప్పారపు రాజయ్య, సానిటరీ మేస్త్రీ రోంటాల సుధీర్, ఉద్యోగులు పాల్గొన్నారు.

నల్ల బ్యాడ్జీలు ధరించి మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తున్న మున్సిపల్ ఉద్యోగులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!