Social 1080×1350 • Multi-page
28-04-2026 BREAKING NEWS 07:51 PM
swarnodayam.com
Telugu Daily News

రైతులకు డిజిల్ కష్టాలు నివారించండి. -ఎడవెల్లి కొండల్ రెడ్డి

రైతులకు డిజిల్ కష్టాలు నివారించండి. -ఎడవెల్లి కొండల్ రెడ్డి
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: డీజిల్ కొరత ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం కొరత లేకుండా చూడాలని బిఆర్ఎస్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎడవెల్లి కొండాల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో వరి కోతలు జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో డీజిల్ కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని పేర్కొన్నారు. కోతకొచ్చిన వరి పంటను సమయానికి కోయడం, తరలించడం కోసం డీజిల్ అత్యవసరమని, కానీ ప్రస్తుతం పెట్రోల్ బంకుల్లో సరిపడా డీజిల్ అందుబాటులో లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. డీజిల్ కొరత కారణంగా కోత యంత్రాలు నిలిచిపోవడంతో పాటు పంట పొలాల్లోనే నిల్వ ఉండే పరిస్థితి ఏర్పడుతోందని ఆయన అన్నారు. దీనివల్ల రైతులకు ఆర్థిక నష్టాలను మిగల్చే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా రైతులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి డీజిల్ సరఫరాను పెంచి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కొండాల్ రెడ్డి డిమాండ్ చేశారు. వరి కోతల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

బిఆర్ఎస్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎడవెల్లి కొండల్ రెడ్డి..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!