Social 1080×1350 • Multi-page
28-04-2026 BREAKING NEWS 09:52 PM
swarnodayam.com
Telugu Daily News

డంపింగ్ యార్డ్ రద్దు కోసం గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం.

డంపింగ్ యార్డ్ రద్దు కోసం గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం.
IMG-20260428-WA0087

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని కోరుతూ బిజెపి ఆధ్వర్యంలో హుజురాబాద్ మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ…వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కు కాంగ్రెస్ పార్టీ అనుకూలమా..? వ్యతిరేకమా .? అనే విషయాన్ని హుజూరాబాద్ కాంగ్రెస్ నేతలు స్పష్టం చేయాలన్నారు.125 ఎకరాల్లో వేస్ట్ టు ఎనర్జీ ఏర్పాటు చేసి హుజురాబాద్ ను నాశనం చేయాలని కాంగ్రెస్ కుట్ర చేస్తుందనీ అన్నారు. నెల రోజులుగా డంపింగ్ యార్డ్ వద్దని ప్రజలు గగ్గోలు పెడుతున్న ప్రభుత్వం స్పందించడం లేదనీ ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు జిల్లాల చెత్తను హుజురాబాద్ తరలించి, వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టును చేపట్టి హుజురాబాద్ భవిష్యత్తును నాశనం చేయాలనే కుట్రలు చేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదిత ప్రాజెక్టు, డంపింగ్ యార్డ్ వల్ల ప్రజల ఆరోగ్యాలపై, పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పై హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. డంపింగ్ యార్డ్, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కున్న తేడా ఏంటో కాంగ్రెస్ నేత ప్రణవ్ స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డ్ లేకుండా వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్ కొనసాగుతుందా ? అని ఆయన ప్రశ్నించారు. జేఏసీ ఆధ్వర్యంలో అనేక ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టినా కూడా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం అన్నారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా తన మొండి వైఖరిని మార్చుకొని, డంపింగ్ యార్డ్, వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోని, ఆదిశగా ప్రకటన చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల, పట్టణ అధ్యక్షులు పారుపల్లి కొండాల్ రెడ్డి, తూర్పాటి రాజు, నాయకులు రాముల కుమార్, రావుల వేణు, గంగిశెట్టి ప్రభాకర్, గంగిశెట్టి రాజు, యాంసాని శశిధర్, తిప్పబత్తిని రాజు, నరాల రాజశేఖర్, సబ్బని రమేష్, నల్ల సుమన్, కందుగుల సర్పంచ్ ముప్పు మహేష్, కౌన్సిలర్ పంజాల మనోజ్, అంకథీ వాసు, గోవిందుల భాస్కర్, కొలిపాక వెంకటేష్, కోలుగురి అనిల్, మోటపోతుల రాకేష్, విజేందర్ రెడ్డి తూముల వెంకట్రావు, వాసాల చిరంజీవి, తునికి రవి, బైరెడ్డి సంపత్ రెడ్డి, మంతెన సురేందర్, రావుల పున్నం చందర్, నరేడ్ల చైతన్య రెడ్డి, పెరుమండ్ల దేవగౌడ్, బండారు లావణ్య, శనిగరం ప్రశాంత్, పంజాల రాజేష్ , కేశవ వేణి మోహన్, అనిల్, ప్రదీప్ నర్ర శ్రీనివాస్ రెడ్డి, బాణాల రఘుపతిరెడ్డి మిడిదొడ్డి రవి, గోపగోని సమ్మయ్య, గాజ ఓదెలు, ఆవుల రాజ్ కుమార్, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వివిధ గ్రామాలలో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్న బిజెపి నాయకులు, కార్యకర్తలు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!