Social 1080×1350 • Multi-page
29-04-2026 BREAKING NEWS 03:29 PM
swarnodayam.com
Telugu Daily News

ఎస్ ఎస్ సి ఫలితాలలో మాంటిస్సోరి విద్యార్థుల విజయభేరి

ఎస్ ఎస్ సి ఫలితాలలో మాంటిస్సోరి విద్యార్థుల విజయభేరి
IMG-20260429-WA0088

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన SSC పరీక్ష ఫలితాలలో స్థానిక మాంటిస్సోరి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించడంతోపాటు అత్యధిక మార్కులు సాధించినట్లు మాంటిస్సోరి ప్రిన్సిపాల్ గీతాషాజు తెలిపారు. ఇందులో భాగంగా G. రిషి వర్ధన్ 600 మార్కులకు గాను 583 సాధించి మొదటి స్థానంలో నిలిచారని అలాగే M. నిహాల్ 581, G.అభినవ్ 581, మహమ్మదీ బేగం 577, M. ప్రణతి 573, K.సాన్విత్ 571 లతోపాటు 30 మంది విద్యార్థులు 550 పై మార్కులు సాధించినట్లు ఆమె పేర్కొన్నారు. ఇంతటి గొప్ప విజయం సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ఆమె అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో, అంబేద్కర్ చౌరస్తా వద్ద టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుకున్నారు.

పదవ ఫలితాల్లో 100 శాతం సాధించి విజయ కేతనం చూపుతున్న మాంటిస్సోరి విద్యార్థులు

జి అభినవ్

జీ రిషివర్ధన్

ఏం నీహాల్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!