Social 1080×1350 • Multi-page
29-04-2026 BREAKING NEWS 09:35 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ లో బిజెపి ఆధ్వర్యంలో ప్రభుత్వం దిష్టిబొమ్మల దహనం

హుజురాబాద్ లో బిజెపి ఆధ్వర్యంలో ప్రభుత్వం దిష్టిబొమ్మల దహనం
IMG-20260429-WA0131

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన డంపింగ్ యార్డును రద్దు చేయాలని బుధవారం బిజెపి నాయకులు హుజురాబాద్ పట్టణంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం బలవంతన డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలని చూడడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, మండల అధ్యక్షులు పారుపల్లి కొండాల్ రెడ్డి, కందుగుల సర్పంచ్ ముప్పు మహేష్, నర్రా శ్రీనివాస్ రెడ్డి, నరెడ్ల చైతన్యరెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, గంగిశెట్టి ప్రభాకర్, గంగిశెట్టి రాజు, పైళ్ళ వెంకట్ రెడ్డి, నల్ల సుమన్, నరాల రాజశేఖర్, యాంసాని శశిధర్, సబ్బని రమేష్, తిప్పబత్తిని రాజు, గంట సంపత్, పడారి సుమన్, గోవిందుల భాస్కర్, ఎర్ర శ్రీధర్, కొలుగూరి అనిల్, రాధాస్వామి, గొట్టే రవీందర్, పడారి కొమురయ్య, అంకతి వాసు, కుమారస్వామి, బొడిగె రాధ, రాకేష్, సమ్మయ్య, అయిత సందీప్, సదయ్య, క్యాసా వెంకటేష్, నగేష్, రవీందర్, రమేష్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

హుజురాబాద్ పట్టణంలోని వివిధ వార్డులలో ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్న బిజెపి నాయకులు, కార్యకర్తలు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!