Social 1080×1350 • Multi-page
02-05-2026 BREAKING NEWS 10:06 PM
swarnodayam.com
Telugu Daily News

డంపింగ్ యార్డు రద్దుకు గళమెత్తిన పద్మశాలీలు.. ఒకరోజు నిరసన దీక్షలో మేము సైతం.

డంపింగ్ యార్డు రద్దుకు గళమెత్తిన పద్మశాలీలు.. ఒకరోజు నిరసన దీక్షలో మేము సైతం.
IMG-20260502-WA0128

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేయ తలపెట్టిన డంపింగ్ యార్డ్ ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కోరుతూ శనివారం తమ బాధ్యతగా పద్మశాలీలు గళమెత్తారు. 41 రోజులుగా డంపింగ్ యార్డ్ వ్యతిరేక అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన దీక్షలో వారు పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. వేస్ట్ టు ఎనర్జీ డంపింగ్ ప్రాజెక్ట్ నిర్మాణం వలన చెత్త నుండి వెలువడు రసాయనాలు భూమిలో ఇంకిపోవడం మూలంగా హుజురాబాద్ పరిసర ప్రాంతాల భూమిలోని నీరు కలుషితమై పోతాయన్నారు. ఎలాంటి పంటలు పండక పోవడమే కాకుండా కలుషిత నీరు త్రాగడం వలన ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురి అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. వేస్ట్ టు ఎనర్జీలో భాగంగా ఎనర్జీని ఉత్పత్తి చేయుటకు చెత్త పదార్థములను కాల్చడం వలన వచ్చేటువంటి డయాక్సిన్ వంటి విషవాయులు గాలిని కలుషితం చేయడం జరుగుతుందని ఫలితంగా ఇక్కడి ప్రజలు లంగ్స్ క్యాన్సర్ తో పాటు మలేరియా టైఫాయిడ్ వంటి విష జ్వరాలకు బారిన పడతారని అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే వ్యవసాయ రంగాన్ని నాశనం చేసే డంపింగ్ యార్డ్ ను ప్రజా ప్రతినిధులు ఏ మాత్రము ఏమరు పాటు లేకుండా తొందరగా మేల్కొని ఐకమత్యంతో ముందుకు కదిలి ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టును రద్దు చేయించి ప్రజల ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత వారిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు చందుపట్ల జనార్ధన్, వేముల యాదగిరి, విడపు రాజు, చిలుకమారి శ్రీనివాస్, సబ్బని రాజేందర్, మంచికట్ల మురళి, ఎం రమేష్, ఇప్పలపల్లి చంద్రశేఖర్, సంగెం సత్యనారాయణ, ఎమ్ బిక్షపతి, ఈ సాగర్, ఎం వెంకట్రాజం, ఈ వెంకటేశ్వర్లు, తాటిపాముల దేవేందర్, మంచికట్ల విజయ్, ఎం రమేష్, టి సంపత్ కుమార్, ఎం వెంకటేశ్వర్లు, కే ప్రభాకర్, కే రామచంద్రం, అఖిలపక్ష నాయకులు గుడిపాటి జయపాల్ రెడ్డి, వేల్పుల రత్నం, సందేల వెంకన్న, మార్త రవీందర్, వెంకట్రావు, టి హనుమంతరావు, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

చేనేత సహకార సంఘము నుంచి ర్యాలీగా వస్తున్న పద్మశాలి కులస్తులు..

నిరసన దీక్షలో మాట్లాడుతున్న టాప్ర జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్..

మాట్లాడుతున్న రిటైర్డ్ ఉద్యోగి మార్త రవీందర్ …

మాట్లాడుతున్న పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకుడు సంఘం సత్యనారాయణ..

తాసిల్దార్ కు వినతి పత్రం అందజేస్తున్న పద్మశాలి సంఘం నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!