Social 1080×1350 • Multi-page
03-05-2026 BREAKING NEWS 07:21 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్‌ లో అత్యాధునిక మెగా కలర్ ల్యాబ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

హుజురాబాద్‌ లో అత్యాధునిక మెగా కలర్ ల్యాబ్ ను ప్రారంభించిన  ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
IMG-20260503-WA0112

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, మే 03 హుజురాబాద్ పట్టణంలోని డీసీఎంఎస్ కాంప్లెక్స్ నందు పాకాల రవీందర్ రెడ్డి – అరుంధతి దంపతులు నూతనంగా ఏర్పాటు చేసిన మెగా కలర్ ల్యాబ్ అండ్ గిఫ్ట్స్ షోరూమ్‌ను హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి, ల్యాబ్‌లోని అత్యాధునిక ప్రింటింగ్ యంత్రాలను పరిశీలించి నిర్వాహకులను అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. హుజురాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఇలాంటి అత్యాధునిక సాంకేతికతతో కూడిన కలర్ ల్యాబ్ అందుబాటులోకి రావడం అభినంద నీయమన్నారు. ప్రజల అభిరుచులకు అనుగుణంగా టీ-షర్ట్ ప్రింటింగ్, కప్పులపై ఫోటో ప్రేమ్స్ ప్రింటింగ్ వైవిధ్యమైన గిఫ్ట్ ఐటమ్స్ అందించడం విశేషమని పేర్కొన్నారు. పాకాల రవీందర్ రెడ్డి వ్యాపార రంగంలో మరిన్ని విజయాలు సాధించి, నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. స్థానిక వ్యాపారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన పిలుపునిచ్చారు.

మెగా కలర్ ల్యాబ్‌లో వినియోగదారుల కోసం సరికొత్త వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా డిజిటల్ ఫోటో ఆల్బమ్స్, వెడ్డింగ్ గిఫ్ట్స్, కస్టమైజ్డ్ కప్పులు మరియు ఫోటో ఫ్రేమ్‌లు అత్యంత సరసమైన ధరలకే లభించనున్నాయి. ఫోటోగ్రఫీ రంగంలో ఉన్న వారికి సాధారణ ప్రజలకు ఇది ఒక వన్ స్టాప్ సెంటర్‌గా ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన మిత్రులు, శ్రేయోభిలాషులు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు.
ఈ ప్రారంభోత్సవ వేడుకలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్ గందే శ్రీనివాస్, పూర్ణచందర్, పాకాల రవీందర్ రెడ్డి, అరుంధతి పాల్గొన్నారు. వీరితో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికార ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, స్థానిక ఫోటోగ్రాఫర్లు, పట్టణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఎమ్మెల్యేకు జ్ఞాపక అందచేస్తున్న షాప్ నిర్వాహకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!