Social 1080×1350 • Multi-page
05-05-2026 BREAKING NEWS 11:36 PM
swarnodayam.com
Telugu Daily News

చెల్పూర్ పిహెచ్ సి ముందు నల్ల బ్యాడ్జీలతో ఆశా వర్కర్ల నిరసన

చెల్పూర్ పిహెచ్ సి ముందు నల్ల బ్యాడ్జీలతో ఆశా వర్కర్ల నిరసన
IMG-20260505-WA0088

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు రావలసిన మార్చి, ఏప్రిల్ 2 నెలల ఆశా వర్కర్ల పారితోషికాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హుజురాబాద్ మండలంలోని చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ఆశా వర్కర్లు నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టారు.
సిఐటియు అనుబంధ ఆశా వర్కర్ల సంఘం హుజురాబాద్ మండల అధ్యక్షురాలు తాడూరి లత ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ 60 మంది ఆశా వర్కర్ల పారితోషికాలు చెల్లించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని ఆరోపించారు. ఫిక్స్డ్ వేతనం 18000 వేల రూపాయలు చెల్లించాలని అదేవిధంగా అనేక ఆరోగ్య కార్యక్రమాల ద్వారా ఆశ వర్కర్ల కు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని వారు ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు తాడూరి లత, నాయకురాళ్లు ఏడుముళ్ల సుజాత,
కాళేశ్వరం పుష్పలత, జంగా రమాదేవి, ఎండీ మాదీనా, ముషం విజయలక్ష్మి, కోరేఫు సరోజ పలువురు ఆశా వర్కర్లు సంఘం నాయకులు, 60 మందికిపైగా ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

చెల్పూర్ పిహెచ్ సి ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న ఆశ వర్కర్స్…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!