Social 1080×1350 • Multi-page
06-05-2026 BREAKING NEWS 09:53 PM
swarnodayam.com
Telugu Daily News

క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. – హుజురాబాద్ ఏసిపి మాధవి

క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. – హుజురాబాద్ ఏసిపి మాధవి
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: చదువుకునే సమయంలో విద్యార్థిని విద్యార్థులు క్రమశిక్షణతో నిబద్ధతతో చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని హుజురాబాద్ ఏసిపి వాసంశెట్టి మాధవి అన్నారు. బుధవారం హుజూరాబాద్ డివిజన్లోని వివిధ మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఆమె అభినందించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… పేదరికం చదువుకో అడ్డు రాదని కష్టపడి చదివి మరిన్ని ఉన్నత విజయాలు సాధించి, తల్లిదండ్రులకు, గురువులకు గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులను సన్మానించి, వారి భవిష్యత్ అభివృద్ధికి తగిన సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో సైదాపూర్, వీణవంక ఎస్సైలు స్వాతి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!