Social 1080×1350 • Multi-page
06-05-2026 BREAKING NEWS 11:51 PM
swarnodayam.com
Telugu Daily News

సింగిల్ విండో చైర్మన్‌గా కటంగూరి శ్రీకాంత్ రెడ్డి బాధ్య‌త‌లు. – హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అధికారుల చర్యలు

సింగిల్ విండో చైర్మన్‌గా కటంగూరి శ్రీకాంత్ రెడ్డి బాధ్య‌త‌లు. – హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అధికారుల చర్యలు
IMG_20260506_235335

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట) : జమ్మికుంట మండలం ధర్మారం సింగిల్ విండో చైర్మన్‌గా కటoగూరి శ్రీకాంత్ రెడ్డి తిరిగి పదవీ బాధ్యతలు స్వీకరించారు. గత పాలకవర్గమే తిరిగి బాధ్యతలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో అధికారులు పదవి బాధ్యత శిఖరాన్ని సొసైటీ సెక్రటరీ గిర్నాటి శ్రీనివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా సింగిల్ విండో కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టగా, వైస్ చైర్మన్‌గా మేడిపల్లి మొగిలి పదవీ బాధ్యతలు స్వీకరించారు. పాలకవర్గ సభ్యులు పొల్నేని జాగ్జీవన్‌రావు, పాత TRV ప్రసాద్, పాత ఈశ్వరమ్మా, మేడిపెల్లి శ్రీనివాస్, మహేశ్ బాస్కర్, గిద్దె రమణారెడ్డి, పూరెళ్ల బద్రయ్య,పొల్నేని వేణుగోపాలరావు,బండి స్వరూప, పొన్నం వెంకటరమణ ఈ కార్యక్రమంలో పాల్గొని చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలియజేసారు. దీనిలో నాయకులు, కౌన్సిలర్లు పోలు దివ్య బిక్షపతి, పొల్నేని శిల్ప వేణుగోపాలరావు, కొలకాని రాజు, తెలంగాణ ఉద్యమ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎక్కటి సంజీవరెడ్డి, ధర్మారం వివిధ రాజకీయ పార్టీల నాయకులు అంజన్నగౌడ్, మారెపల్లి అజయ్ కుమార్, మారేపల్లి ఆంజనేయులు, బండి పవన్, పోతుల శ్రీనివాస్, మల్లాడి శ్రీనివాస్ రెడ్డి, రావుల మధు తదితర నాయకులు పాల్గొన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లకు శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!