Social 1080×1350 • Multi-page
08-05-2026 BREAKING NEWS 09:45 PM
swarnodayam.com
Telugu Daily News

ఆయిల్ కంపనీల మార్గదర్శకాలు పాటించాలి. – ఐఓసియల్ కరీంనగర్ విక్రయ విభాగం ఒకటి అధికారి క్రిష్ణచైతన్య

ఆయిల్ కంపనీల మార్గదర్శకాలు పాటించాలి. – ఐఓసియల్ కరీంనగర్ విక్రయ విభాగం ఒకటి అధికారి క్రిష్ణచైతన్య
IMG_20260508_214013

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్, మే 8 : పశ్చిమాసియాలో ఏర్పడిన యుద్దం నేపథ్యంలో మనకు రావాల్సిన ముడి చమురు దిగుమతుల విషయంలో ఏర్పడిన ప్రతిష్టంభన వల్ల వంట గ్యాస్ సరఫరాలో‌ కొన్ని ఆటంకాలు ఏర్పడ్డాయని, నిజమైన వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలనే సంకల్పంతో వందశాతం డిజిటల్ బుకింగ్ IVRS, OTP కలిగివున్న కస్టమర్లకు గ్యాస్ సిలిండర్లు అందింస్తున్నామని‌ ఐఓసియల్ కరీంనగర్ విక్రయ విభాగం ఒకటి అధికారి క్రిష్ణచైతన్య తెలిపారు.శుక్రవారంనాడు కరీనగర్ త్రిధ హోటల్ వేడుకల మందరంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఇండేన్ డీలర్ల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.మార్చిలో యద్ద ప్రారంభంలో రీపీల్ బుకింగ్ గణనీయంగా పెరిగిందని ఆయిల్ కంపనీల సమర్థ చర్యల వల్ల బ్యాక్లాగ్ తగ్గిందని వివరించారు. పట్టణ ప్రాంతాలలో 25 రోజులు గ్రామీణ ప్రాంతాలలో 45 బుకింగ్ వ్యవధిని విధానాన్ని అన్ని ఆయిల్ కంపనీలు పాటిస్తున్నాయని చైతన్య వివరించారు..సంక్లిష్టమైన సమయంలో అందించే వంటగ్యాస్ సిలిండర్లను జాగ్రత్తగా వాడాలని సూచించారు.ఇండేన్ డీలర్లు సిలిండర్లు అందించే క్రమంలో ఆయిల్ కంపనీలు ప్రతిపాదించి‌న ప్రీడెలివరి చెక్స్ (ముందస్తు తనిఖీలు) విధిగా డెలివరీ సిబ్బంది చేయాలని‌ ఇందులో కస్టమర్లకు జారీ చేసే సిలిండర్ల సీలును వారి ఎదుట తొలగించి ఓ రింగ్ స్థితి, సిలిండర్ తూకం వేయడం,సిలిండర్ స్థితిగతులు పరిశీలించి గ్యాస్‌ ప్రమాదాల నివారణకు చొరవ చూపాలని కోరారు.సిలిండర్ల జారీకి ఈకైవైసి తప్పని సరి కేవైసి లేకుంటే కనెక్షన్ల రద్దుకు అవకాశం వుందని తెలిపారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ యల్పీజి డీలర్ల సంఘం మాజీ కార్యదర్శి పి.వి.మదన్ మోహన్ కరోనా కష్ట కాలంలో కస్టమర్లకు ఏ విధంగా అయితే సేవలు అందించారో సంక్లిష్టమైన యుద్ద సమయంలో కంపనీ జారీ చేసిన సిలిండర్లు సీనియారటి పద్దతి ప్రకారం అందించడం, ఓటిపి విధానం గట్టిగా అమలు చేయడం లాంటి చర్యలు,పూర్తిగా ఇంటి వద్దనే సిలిండర్లు అందించే చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని తెలిపారు.కష్టకాలంలో కంపనీలకు బాసటగా నిలిచిన కస్టమర్లకు ధన్యవాదాలు తెలిపారు.గత నాలుగు సంవత్సరాల కాలంగా పని చేసి పదోన్నతిపై ముంబాయి ఐఓసియల్ కేంద్ర కార్యలయానికి బదిలీ అయిన మిట్ట మహేశ్ స్థానంలో చైతన్య ఈ ప్రాంత అధికారిగా భాద్యతలు స్వీకరించారని‌ మదన్ మోహన్ తెలిపారు. తెలంగాణ వంట గ్యాస్ డీలర్ల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీచరణ్ మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాలకు ఏకీక్రుత విధానంలో ఐఓసియల్ సిలిండర్లు సరఫరా చేసే విధంగా క్రుషి చేస్తున్నామని‌ఈ విషయంలో కంపనీలపై ఒత్తిడిని పెంచుతున్నామని తెలిపారు. సభాద్యక్షులు బొమ్మ రాధక్రిష్ణ మాట్లాడుతూ యల్పీజి సరఫరా విధానంలో వచ్చిన మార్పులవల్ల ట్రక్ రవాణాదారులకు ఆదాయాలు గణనీయమైన సంఖ్యలో పడిపోవడం వల్ల సిలిండర్ల సరఫరా కొంత మందగించడం జరిగిందని ఈ విషయంలో కంపనీ చొరవ చూపాలని,బుకింగ్ ప్రకారం సిలిండర్ల పంపే విధంగా అధికారులు చొరవచూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డీలర్లు శ్రీధర్ పనకంటి, రాంరెడ్డి, ప్రవీణ్, భాస్కర్, దామోదర్ రావు, వీరన్న, రాజిరెడ్డి, భాగ్యలత, మీరాబాయి, భవాని, సాప్ట్వేర్ప్రొవైడర్లు హనుమంతు, శివ, అగిస్టన్, ప్రభుతులు పాల్గొన్నారు.

ఐఓసియల్ కరీంనగర్ విక్రయ విభాగం ఒకటి అధికారి క్రిష్ణచైతన్యకి పూలపు కేజీ స్వాగతం పలుకుతున్న ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ యల్పీజి డీలర్ల సంఘం మాజీ కార్యదర్శి పి.వి.మదన్ మోహన్

మాట్లాడుతున్న ఐఓసియల్ కరీంనగర్ విక్రయ విభాగం ఒకటి అధికారి క్రిష్ణచైతన్య

కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ డీలర్లుతో అధికారులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!