Social 1080×1350 • Multi-page
09-05-2026 BREAKING NEWS 09:32 AM
swarnodayam.com
Telugu Daily News

బిఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్.!

బిఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్.!
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బిఆర్ఎస్ ఇచ్చిన కరీంనగర్ నగర బంద్ పిలుపుతో ముందస్తు చర్యల్లో భాగంగా హుజురాబాద్ పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులను శనివారం ఉదయం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, రాజపల్లి సర్పంచ్ కటుకూరి మల్లారెడ్డి, కౌన్సిలర్ వర్ధినేని రవీందర్ రావు, గందె శ్రీనివాస్, కేశిరెడ్డి లావణ్య, నాయకులు ప్రతాప తిరుమల్ రెడ్డి, ప్రతాప కృష్ణలను ఉదయం 6 గంటలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హుజూరాబాద్ మండలంలోని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్ లు, కౌన్సిలర్లను ముందస్తు అరెస్టు చేసేందుకు పోలీసులు తెల్లవారు జామున నుండే వారి ఇంటికి వెళ్లారు. కాగా పోలీసులు అరెస్ట్ చేస్తారనే సమాచారంతో కొందరు నాయకులు అప్పటికే ఇండ్ల నుంచి బయటకు వెళ్లి పోయారు. పోలీసు ఉన్నతాధికారులు పంపించిన బిఆర్ఎస్ శ్రేణులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కరీంనగర్లో బందు కు పిలుపునిస్తే హుజురాబాద్లో నేతలను ముందస్తు అరెస్టు చేయడంపై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

పోలీసులు ముందస్తు అరెస్టు చేసిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బండ శ్రీనివాస్, కౌన్సిలర్ రవీందర్రావు, గందె శ్రీనివాస్, కేసిరెడ్డి లావణ్య, సర్పంచ్ మల్లారెడ్డి మాజీ కౌన్సిలర్ తిరుమలరెడ్డి నాయకుడు కృష్ణ తదితరులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!