Social 1080×1350 • Multi-page
09-05-2026 BREAKING NEWS 09:19 PM
swarnodayam.com
Telugu Daily News

వీడిన అనిశ్చితి… రేపు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం

వీడిన అనిశ్చితి… రేపు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం
IMG-20260509-WA0077

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్ మే 09: తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. రేపు ఉదయం 10 గంటలకు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో కార్యక్రమం జరగనుంది. ఈమేరకు లోక్ భవన్ ఒక ప్రకటనను విడుదలచేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు సంఖ్యాబలం పార్టీల వారిగా..TVK-107, కాంగ్రెస్-5, CPI-2, CPM-2, VCK-2, IUML-2 మొత్తం 120 మంది మద్దతుదారులు ఉండడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సులభమైంది. నేడు సాయంత్రం గవర్నర్ ను కలిసిన టీవీకే చీఫ్ విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ను కోరగా, ఇతర పార్టీల మద్దతుతో మెజార్టీ మార్కును చేరుకోవడంతో సానుకూలంగా స్పందించారు. అయితే మే 13వ తేదీలోగా బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ సూచించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!