Social 1080×1350 • Multi-page
11-05-2026 BREAKING NEWS 09:00 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ పురపాలక సంఘ కమిషనరుగా బి. కిషన్ పదవీ బాధ్యతల స్వీకరణ.

హుజురాబాద్ పురపాలక సంఘ కమిషనరుగా బి. కిషన్ పదవీ బాధ్యతల స్వీకరణ.
IMG-20260511-WA0262

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా కొనసాగుతున్న బి కిషన్ ని ప్రభుత్వం హుజురాబాద్ పురపాలక సంఘ కమిషనరుగా బదిలీ చేయగా సోమవారం రాత్రి హుజురాబాద్ పురపాలక సంఘ కమిషనరుగా పదవీ భాద్యతలు స్వీకరించారు. హుజురాబాద్ మునిసిపాలిటీలో కమిషనరుగా విధులు నిర్వహించిన ముసాబ్ అహ్మద్ సయ్యద్ ని కమిషనర్ & డైరెక్టర్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, తెలంగాణ, హైదరాబాద్ కార్యాలయములో రిపోర్టు చేయాలని ఆదేశించారు.

కాగా నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన బి కిషన్ ని మున్సిపల్ కార్యాలయ మేనేజర్ రావుల భూపాల్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ నాయిని అశ్వినీగాంధీ, సానిటరీ ఇన్స్పెక్టర్ ధరిపల్లి కిరణ్, జూనియర్ అకౌంటెంట్ సి.హెచ్. గోపాల్ రెడ్డి, ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ పి.వినయ్ మరియు ఇతర మునిసిపల్ సిబ్బంది పూల బొకే ఇచ్చి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

నూతన కమిషనర్ కిషన్ ను శాలువా కప్పి, పూల బొకే ఇచ్చి సత్కరిస్తున్న కార్యాలయం మేనేజర్, ఇతర ఉద్యోగులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!