Social 1080×1350 • Multi-page
14-05-2026 BREAKING NEWS 07:52 PM
swarnodayam.com
Telugu Daily News

దళిత బంధు రెండో విడత నిధులు మంజూరు చేయాలని బాధితుల వినతి.

దళిత బంధు రెండో విడత నిధులు మంజూరు చేయాలని బాధితుల వినతి.
IMG_20260514_193530

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మునిసిపల్ పరిధిలోని దళిత బంధు రెండో విడత రానీ లబ్ధిదారులు రెండో విడత నిధులు మంజూరు చేయించాలని కోరుతూ మున్సిపల్ చైర్ పర్సన్ రోంటాల సుహాసినికి గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో గ్రౌండింగ్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందన్నారు. తదుపరి మున్సిపల్ ఎన్నికలు ముగిసి మూడు నెలలు కావస్తున్న గ్రౌండింగ్ ప్రక్రియను పునర్ ప్రారంభించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తూ లబ్ధిదారులను భయాందోళనకు గురి చేస్తున్నారన్నారు. రెండో విడత దళిత బంధు నిధులు మంజూరు చేసే విధంగా సంబంధిత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లి రెండో విడత నిధులు మంజూరు అయ్యేలా కృషి చేయాలని చైర్పర్సన్ రోంటాల సుహాసిని కి బాధితులు విజ్ఞప్తి చేశారు. చైర్ పర్సన్ ను కలిసి విజ్ఞప్తి చేసిన వారిలో గొర్రె గీత, ఆర్ సుజాత, ఆర్ సరోజన, సారమ్మ, కుక్కముడి రజిత కొయ్యడ లక్ష్మి, ఎం లక్ష్మి, సిహెచ్ సుమతి, ఈ సబిత, రాసపల్లి స్వరూప, కొయ్యడ ఐలమ్మ, పార్లపల్లి భాగ్య, పద్మ, రాచపల్లి స్వరూప, గొర్రె మొగిలి, గొర్రె రాణి, రాసపల్లి భారతి, బండ సంపత్ కుమార్, బత్తుల శ్రీలత, లంకదాసి సంధ్య, నమిండ్ల రాజేశ్వరి, నమిండ్ల సుజాత, ఎర్రబెల్లి మంజుల, గొర్రె వనజ, రాసపల్లి స్వరూప, బొడ్డు రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని కి వినతిపత్రం ఇస్తున్న రెండో విడత దళిత బంధు బాధితులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!