Social 1080×1350 • Multi-page
14-05-2026 BREAKING NEWS 11:52 PM
swarnodayam.com
Telugu Daily News

గ్రామ గ్రామాన బడిబాట ర్యాలీలు.. -తల్లిదండ్రులతో సమావేశాలు

గ్రామ గ్రామాన బడిబాట ర్యాలీలు.. -తల్లిదండ్రులతో సమావేశాలు
IMG-20260514-WA0147

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: విద్యా వారోత్సవాలలో భాగంగా గురువారం హుజురాబాద్ మండలంలో గ్రామ గ్రామాన ఉపాధ్యాయులు అధికారులు ప్రజా ప్రతినిధులు ఆచార్య జయశంకర్ బడిబాట ర్యాలీలు నిర్వహించారు. హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలికల పాఠశాల సెకండరీ పాఠశాల పిఎస్ తదితర పాఠశాలల ఉపాధ్యాయులు పట్టణంలో బడిబాట ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు చేయాలని తల్లిదండ్రులను కోరారు. —చెల్పూర్ లో... ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలి. ప్రభుత్వం పేద పిల్లల కోసం ఉచిత విద్యను అందిస్తుందని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని హుజురాబాద్ మండల పరిషత్ అధికారిని తూర్పాటి సునీత అన్నారు. హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలో బడిబాట ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ… పేద పిల్లలకు విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న వాటిని ప్రజలు వినియోగించు కోవాలన్నారు. ఎంఈఓ వి. శ్రీనివాస్ మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందని దానిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో చెల్పూర్ సర్పంచ్ వంతడుపుల కస్తూరి, రాజపల్లి సర్పంచ్ కట్కూరి మల్లారెడ్డి, ఏఏపిసి చైర్మన్ రాజ సులోచన, ప్రధానోపాధ్యాయురాలు అనురాధ, రమాదేవి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!