Social 1080×1350 • Multi-page
15-05-2026 BREAKING NEWS 07:19 PM
swarnodayam.com
Telugu Daily News

వైభవంగా అంబుజా గ్యాస్ ఏజన్సీస్ 37వ వార్షికోత్సవ వేడుకలు.- ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ సమక్షంల కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ.

వైభవంగా అంబుజా గ్యాస్ ఏజన్సీస్ 37వ వార్షికోత్సవ వేడుకలు.- ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ సమక్షంల కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ.
1005405737

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, మే 15: హుజురాబాద్ పట్టణంలోని అంబుజా గ్యాస్ ఏజెన్సీ స్ నెలకొల్పి 37 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ సమక్షంల కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా అఫీసు సిబ్బంది డెలివరి సిబ్బందిని ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా పి.వి.మదన్ మోహన్ ఐఓసియల్ అధికారులు అమూల్యమైన సలహాలతో పాటు పొందుపరచిన మార్గదర్శకాలను అమలు చేయడం వల్ల ఏలాంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారం ముందకు సాగుతున్నదని తెలిపారు‌. సుదీర్ఘమైన యల్పీజి జీవన యానంలో హుజురాబాద్ ప్రాంత పెద్దలు, రాజకీయ పార్టీల నాయకులు స్వచ్చంద సంస్థల సభ్యుల అమూల్యమైన సలహాలు గొప్పవని తెలిపారు. మూడున్నర దశాబ్దాల పైగా సుదీర్ఘ ప్రయాణంలో ప్రాత్రికేయుల సహకారం మరువలేనిదన్నారు. ఇక్కడ పని చేస్తున్న జర్నలిస్టులకు నాటి నుండి నేటి వరకు అన్ని విషయాలపై పరిజ్ఞానాన్ని కలిగిన వారు..అందుకే వారి సూచనలు అంబుజా గ్యాస్ విజయానికి కారణమయ్యాయి అని పేర్కొన్నారు.
కస్టమర్లకు నాణ్యమైన సేవలే లక్ష్యంతో పని చేస్తున్నామని ఈ విషయంలో కస్టమర్ల భాగస్వామ్యం అవసరమని పి.వి.మదన్ మోహన్ కోరారు.

ఆదినుండి సంస్థతో మమేకమైన పది మంది కస్టమర్లను గుర్తించి ‌ సిబ్బందితో వారిళ్లకు వెళ్లి సత్కారాలు జరిపి స్వీట్లు పంచి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది మదన్ మోహన్ నాయకత్వంలోని యాజమాన్యం. అదేవిధంగా గ్యాస్ భద్రత పై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో మేనేజర్ దేవేందర్ రెడ్డి, సీనియర్ కంప్యూటర్ సిబ్బంది పవన్, శరత్, భరత్, భరత్ రెడ్డి, గోదాం కీపర్ ప్రభు, సిబ్బంది సురేశ్, కమలాకర్, చిరంజీవి, అనీల్, సాగర్, నర్సయ్య, దామోదర్, సింగాపురం సురేశ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

పీవీ మదన్ ను సన్మానిస్తున్న కస్టమర్లు..

కస్టమర్లను ఉద్దేశించి మాట్లాడుతున్న పీవీ మదన్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!