Social 1080×1350 • Multi-page
16-05-2026 BREAKING NEWS 09:15 PM
swarnodayam.com
Telugu Daily News

వర్కింగ్ జర్నలిస్టుల అభ్యున్నతికి నేనెప్పుడూ అండగా ఉంటా.. – TUWJ (IJU) జిల్లా మహా సభలో పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని..

వర్కింగ్ జర్నలిస్టుల అభ్యున్నతికి నేనెప్పుడూ అండగా ఉంటా.. – TUWJ (IJU) జిల్లా మహా సభలో పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని..
IMG-20260516-WA0082

—హనుమకొండ జిల్లా జర్నలిస్టులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో లబ్ధి చేకూర్చే కృషి చేస్తా..

—TUWJ (IJU) జిల్లా మహా సభలో పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని..

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హనుమకొండ: హనుమకొండ జిల్లా వర్కింగ్ జర్నలిస్టులకు నా వంతుగా ఎల్లప్పుడు అండగా ఉంటానని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శనివారం రోజున హనుమకొండ ప్రెస్ క్లబ్ లో జరిగిన TUWJ (IJU) జిల్లా అధ్యక్షుడు గడ్డం రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన మహాసభకు KUDA చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమైందన్నారు. ప్రజా సమస్యలను నిర్భయంగా వెలుగులోకి తీసుకువస్తూ సమాజానికి దిశానిర్దేశం చేసే బాధ్యత జర్నలిస్టులపై ఉందని పేర్కొన్నారు. కష్టనష్టాలను ఎదుర్కొంటూ ప్రజల కోసం పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ హనుమకొండ జిల్లా జర్నలిస్టులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆరోగ్య భద్రత, ఇండ్ల స్థలాలు, అక్రిడిటేషన్ తదితర అంశాల్లో తాను ఎల్లప్పుడూ సహకరిస్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

అనంతరం TUWJ (IJU) జిల్లా నాయకులు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారిని ఘనంగా సన్మానించి, జర్నలిస్టుల పట్ల చూపుతున్న ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు.

అంతక ముందు విధి నిర్వహణలో పలు కారణాల చేత మృతి చెందిన జర్నలిస్టులకు మౌనం వహిస్తూ సంతాపం తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు విరాహత్ అలీ, రామ్ నారాయణలు పలువురు జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు, సంఘ నాయకులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!