Social 1080×1350 • Multi-page
17-05-2026 BREAKING NEWS 11:58 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ బీసీ జేఏసీ ఆధ్వర్యంలోహుజురాబాద్ రూరల్ సీఐ వీరబత్తిని శ్రీనివాస్ కి ఘన సన్మానం

హుజురాబాద్ బీసీ జేఏసీ ఆధ్వర్యంలోహుజురాబాద్ రూరల్ సీఐ వీరబత్తిని శ్రీనివాస్ కి ఘన సన్మానం
IMG-20260517-WA0066

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : ఇటీవల బదిలీపై వచ్చిన హుజూరాబాద్ రూరల్ సీఐ వీరభత్తిని శ్రీనివాస్ ని హుజూరాబాద్ పట్టణంలోని వారి కార్యాలయంలో బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షుడు సందేల వెంకన్న ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ గతంలో హుజూరాబాద్ టౌన్ సిఐగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్న వీరభత్తిని శ్రీనివాస్ హుజూరాబాద్ రూరల్ సిఐగా రావడం పట్ల తమ హర్షాన్ని వ్యక్తం చేశారు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజల కొరకు చట్ట ప్రకారము నియమ నిబంధనలను అనుసరించి సమ న్యాయాన్ని పాటిస్తూ అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా తమ విధిని నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సమాజంలోని నిరుపేదలు అట్టడుగు వర్గాల ప్రజల ఆదరాభిమానాన్ని చూర గోనే విధంగా ఎల్లప్పుడూ విశాలమైన దృష్టితో ప్రజల పక్షాన నిలుస్తూ ఆదర్శవంతమైన పోలీస్ ఆఫీసర్ గా పేద బడుగు బలహీనవర్గాల న్యాయం కొరకు నిజాయితీకి నిలువుటదంగా నిలుస్తూ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యుత్తమ పోలీస్ ఆఫీసర్ గా ఎదగాలని ఆకాంక్షింఛారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు వన్నాల శివాజీ, మాజీ సర్పంచులు తొగరు బిక్షపతి, బింగీ కరుణాకర్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి రమేష్, బీసీ జెఎసి ప్రధాన కార్యదర్శి చిలుకమారి శ్రీనివాస్, ఇప్పకాయల సాగర్, మంద బిక్షపతి, కాసగొని కిరణ్ గౌడ్, పబ్బ తిరుపతిగౌడ్, పల్లె సతీష్ గౌడ్, తులసి లక్షణామూర్తి, సురుకొంటి బాల్ రెడ్డి, దొంత హరికిషన్, తాటిపాముల దేవేందర్, తునికి సమ్మయ్య, పంజాల వెంకటేశ్వర్లు, పోగు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!