Social 1080×1350 • Multi-page
18-05-2026 BREAKING NEWS 11:57 PM
swarnodayam.com
Telugu Daily News

కిషోర బాలికలకు రక్త పరీక్షల శిబిరం.. ప్రారంభించిన మునిసిపల్ చైర్ పర్సన్

కిషోర బాలికలకు రక్త పరీక్షల శిబిరం.. ప్రారంభించిన మునిసిపల్ చైర్ పర్సన్
IMG_20260518_235515

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రజా పాలన కార్యక్రమంలో సోమవారం హుజురాబాద్ మెప్మా కార్యాలయంలో కిషోర బాలికలకు ప్రత్యేక రక్త పరీక్షా శిబిరం హుజురాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో ఉన్న కిశోర బాలికలు రక్త పరీక్ష కేంద్రాలను ఉపయోగించు కోవాలన్నారు.

అనంతరం హుజురాబాద్
డిప్యూటీ డిఎంహెచ్ ఓ హుజురాబాద్ డాక్టర్ గొట్టే శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ…
15 నుండి 18 సంవత్సరాల వయసుగల కిశోర బాలికలకు అనీమియా రక్త పరీక్షల ప్రత్యేక వైద్య శిబిరం ఈనెల 23వ తేదీ వరకు నిర్వహిస్తారని అన్నారు.
హుజురాబాద్ మునిసిపల్ పరిధిలోని అన్ని వార్డులలో కిషోర బాలికలకు అనీమియా రక్త పరీక్షలు, బిఎంఐ పర్సనల్ హైజిన్ కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించడంతోపాటు రక్తపరీక్షలు చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ తులసీదాస్, డాక్టర్ ప్రత్యూష, వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు విజేందర్ రెడ్డి, లక్ష్మి, సత్యo, తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!