Social 1080×1350 • Multi-page
19-05-2026 BREAKING NEWS 08:19 PM
swarnodayam.com
Telugu Daily News

ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం.. -ప్రణవ్ చిత్రపటానికి పాలాభిషేకంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని

ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం.. -ప్రణవ్ చిత్రపటానికి పాలాభిషేకంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని
IMG_20260519_201028

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : అన్ని వర్గాలకు చెందిన ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని అన్నారు. మంగళవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఓడితల ప్రణవ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… గత కొన్ని రోజులుగా దళిత బందు రెండో విడత నిధులు విడుదల గాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తించిన ఒడితల ప్రణవ్ దళిత బంధు రెండో విడత నిధుల విడుదల చేసేందుకు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఇప్పిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని ఆమె తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతుందని ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బోరగాల మొగిలి, ఇల్లందుల సమ్మయ్య, సొల్లు సునీత, కాంగ్రెస్ పార్టీ నాయకులు సందమల్ల బాబు, బండ నవీన్, కోయల్ కార్ సమన్, దుబాసి బాబు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ నేత ప్రణవ్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న మునిసిపల్ చైర్ పర్సన్ సుహాసిని..

రెండో విడత లబ్ధిదారులకు స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలుపుతున్న చైర్పర్సన్ సుహాసిని..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!